న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15 : మదింపు సంవత్సరం 2025-26కుగాను ఆదాయ పన్ను (ఐటీ) రిటర్నుల దాఖలుకున్న గడువును సోమవారం సీబీడీటీ మరొక్కరోజు పొడిగించింది. దీంతో మంగళవారం కూడా ఐటీఆర్ ఫైలింగ్ చేసుకోవచ్చు. కాగా, ఇప్పటిదాకా 7 కోట్లకుపైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయి.
ఇందులో 6.03 కోట్లకుపైగా ఐటీ రిటర్నులను ఐటీ శాఖ వెరిఫై చేసింది. 4 కోట్ల ఐటీ రిటర్నులను ప్రాసెస్ చేసింది. అయితే ఐటీ రిటర్నుల దాఖలుకు సోమవారమే ఆఖరు తేదీ కావడంతో ఫైలింగ్ పోర్టల్‌పై ఒత్తిడి కనిపించింది. ఇక ఆలస్య రుసుము రూ.5,000 (రూ.5 లక్షలదాకే వార్షిక ఆదాయం ఉంటే రూ.1,000), వడ్డీతో బుధవారం నుంచి కూడా ఐటీ రిటర్నులను దాఖలు చేసుకోవచ్చు.