హనుమకొండ, సెప్టెంబర్ 16: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లోని సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీ (సీఆర్ఐఎఫ్), అజిలెంట్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అక్షయలాబ్ టెక్‌లతో సంయుక్తంగా ప్రపంచ ఓజోన్ దినోత్సవం సందర్భంగా ఒకరోజు సాంకేతిక శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ‘పర్యావరణ స్థిరత్వం కోసం ఆధునిక విశ్లేషణాత్మక సాంకేతికతలు’ అనే థీమ్‌తో జరిగిన ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
నిపుణుల ప్రసంగాలు, ప్రాక్టికల్ ప్రదర్శనలు, పరికరాల ప్రత్యక్ష వాక్ త్రూలతో పాటు ఎల్సీఎంఎస్ఎంఎస్, జీసీఎంఎస్ఎంఎస్, ఐసీపీఎంఎస్, స్పెక్ట్రోస్కోపీ, మైక్రోప్లాస్టిక్స్ డిటెక్షన్, నమూనా తయారీ విధానాలు, డేటా విశ్లేషణ, పర్యావరణ పరిశీలనలో వాటి ఉపయోగాలపై ప్రత్యేక సెషన్లు నిర్వహించారు. డైరెక్టర్ ప్రొఫెసర్ బిడ్యాధర్ సుబుధి పర్యావరణ స్థిరత్వం ప్రాముఖ్యతను వివరించారు.
ప్రొఫెసర్ సోనవానే శిరీష్హరి (డీన్ -ఆర్ అండ్ డీ) సంస్థ పరిశోధనా కార్యక్రమాల గురించి మాట్లాడారు. సీఆర్ఐఎఫ్ హెడ్ ప్రొఫెసర్ ఎ.వీరేశ్‌బాబు అధునాతన పరిశోధనలకు మద్దతు అందించడంలో సీఆర్ఐఎఫ్ గురించి వివరించారు. ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డి.రవికుమార్, అజిలెంట్ టెక్నాలజీస్ అకౌంట్ మేనేజర్ శేష్‌కుమార్, టెక్నికల్ ఆఫీసర్లు వి.సుధాకర్, జి.ఎస్.ఆర్. సంజీవిని, సిబ్బంది పాల్గొన్నారు.