ముంబై, సెప్టెంబర్ 15 : దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్‌పడింది. వరుసగా ఎనిమిది రోజులుగా పెరుగుతూ వచ్చిన సూచీలకు ఐటీ, వాహన రంగ షేర్లు ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో సూచీలు నష్టపోయాయి.
వడ్డీరేట్ల తగ్గింపుపై అమెరికా ఫెడరల్ రిజర్వు ఈ వారంలోనే నిర్ణయం తీసుకోనుండటంతో మదుపరులు అప్రమత్తకు మొగ్గుచూపారు. ఫలితంగా ఐదు రోజులుగా పెరుగుతూ వచ్చిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 118.96 పాయింట్లు కోల్పోయి 81,785.74 వద్ద ముగియగా, నిఫ్టీ 44.80 పాయింట్లు నష్టపోయి 25,069.20 వద్ద ముగిసింది.