బెంగాల్లో భారీ వర్షం: 20 మంది మృతి
బెంగాల్‌లోని వివిధ జిల్లాల్లో సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి 20 మంది మృతి చెందగా, మెరుపుల కారణంగా చాలా మంది గాయపడ్డారు.

కోల్‌కతా: బెంగాల్‌లోని వివిధ జిల్లాల్లో సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి 20 మంది మృతి చెందగా, మెరుపుల కారణంగా చాలా మంది గాయపడ్డారు. దక్షిణ బెంగాల్‌లోని కోల్‌కతాతో పాటు పలు జిల్లాల్లో కూడా భారీ ఉరుములు, పెద్ద ఎత్తున వర్షాలు కురిశాయి. మెరుపు కారణంగా ముర్షిదాబాద్‌లో 9 మంది, హుగ్లీలో 9, పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో ఇద్దరు మరణించారు. భారీ వర్షాలకు 20 మంది మరణించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
మరోవైపు, వర్షం కారణంగా కోల్‌కతాతో పాటు వివిధ జిల్లాల ప్రజలు తీవ్రమైన వేడి నుంచి ఉపశమనం పొందారు. అలీపోర్ వాతావరణ కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, జూన్ 11 న బంగాళాఖాతానికి ఉత్తరాన అల్పపీడనం తలెత్తనున్నది. ఇదే అల్పపీడనంతో రుతుపవనాల వర్షాలు బెంగాల్‌పై కురుస్తాయి.
వాతావరణ కార్యాలయం ప్రకారం, ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా రుతుపవనాలు సాధారణంంగా ఉన్నాయి. అయితే బెంగాల్, బిహార్, అసోంలోని కొన్ని జిల్లాల్లో సాధారణ వర్షాల కన్నా తక్కువ వర్షాలు కురువనున్నాయి. కోల్‌కతాలో సోమవారం మధ్యాహ్నం నుంచి మేఘాలు కమ్ముకోవడంతో రాజధాని నగరం చీకటిగా మారిపోయింది. బలమైన గాలులతో కూడిన వర్షం కురిసింది. కొన్ని జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసి పలు ప్రాంతాల్లో ఇళ్లకు నష్టం వాటిల్లింది. ‘యాస్’ తుఫాను తర్వాత బెంగాల్లో సున్నితమైన వేసవి కాలం ప్రారంభమై ప్రజలను చెమటతో తడిసిపోయేలా చేసింది. ఉష్ణోగ్రత కూడా రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది. రుతుపవనాలు రాకముందే వర్షం కురియడంతో ప్రజలకు కొంత ఉపశమనం లభించినట్లయింది.
ఇవి కూడా చదవండి..
హింసల మధ్యే అమెరికా ప్రతినిధి బృందంతో ఘని భేటీ
మోదీకి బుఖారీ వినతి : జామా మసీదు మరమ్మతుకు సాయం చేయండి
కొత్త సేవలు : స్పీడ్ పోస్ట్‌లో అస్తికల నిమజ్జనం
ఇమ్యూనిటీ బూస్టర్ : పనస గింజల్లో దాగి ఉన్న ఆరోగ్యం
ఫుల్ ట్రోలింగ్ : తొలి డోసు తీసుకున్న ములాయం
ఆధిపత్యం వద్దు : చైనా విశ్వవిద్యాలయం ఏర్పాటుపై ఆందోళన
జీ 7 సమ్మిట్ : గ్లోబల్ టాక్సేషన్ సిస్టంకు గ్రీన్‌సిగ్నల్
ICAI CA 2021: సవరించిన షెడ్యూల్ విడుదల
లిలిబెట్ డయానా : రెండోసారి తల్లిదండ్రులైన హ్యారీ, మేఘన్
చరిత్రలో ఈరోజు.. తొలి వన్డే వరల్డ్ కప్ ప్రారంభం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

