లిలిబెట్ డయానా : రెండోసారి తల్లిదండ్రులైన హ్యారీ, మేఘన్
ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మెర్కెల్ రెండోసారి తల్లిదండ్రులు అయ్యారు. అమ్మాయికి జన్మనిచ్చిన విషయాన్ని వారే స్వయంగా ప్రకటించారు. తమ కుమార్తెకు లిలిబెట్ డయానా అని పేరు పెట్టారు

లండన్ : ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మెర్కెల్ రెండోసారి తల్లిదండ్రులు అయ్యారు. అమ్మాయికి జన్మనిచ్చిన విషయాన్ని వారే స్వయంగా ప్రకటించారు. తమ కుమార్తెకు లిలిబెట్ డయానా అని పేరు పెట్టారు. లిలిబెట్ శుక్రవారం కాలిఫోర్నియాలోని శాంటా బార్బరా కాటేజ్ దవాఖానలో జన్మించింది. లిలికి ముత్తాత, క్వీన్ ఎలిజబెత్ II పేరు పెట్టారు. వారి కుటుంబానికి లిలిబెట్ అనే మారుపేరు ఉన్నది. లిలి అనేది ప్రిన్స్ హ్యారీ తల్లి ప్రిన్సెస్ డయానా పేరు నుంచి తీసుకున్నారు. వీరికి 2019 లో ఆర్చీ హారిసన్ మౌంట్ బాటన్ విండ్సర్ అనే కుమారుడు కూడా ఉన్నారు. సస్సెక్స్ డ్యూక్, డచెస్ శుభాకాంక్షలు, ప్రార్థనలన్నిటికీ కృతజ్ఞతలు తెలుపుతున్నారని రాయల్ జంట ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఇలాఉండగా, క్వీన్ ఎలిజబెత్ II మనవడు హ్యారీ, మేఘన్ గత మార్చిలో ఫ్రంట్‌లైన్ రాయల్ విధుల నుంచి వైదొలిగి ప్రస్తుతం కాలిఫోర్నియాలో నివసిస్తున్నారు. గత ఏడాది జనవరిలో ఇద్దరూ డ్యూక్ ఆఫ్ సస్సెక్స్, డచెస్ ఆఫ్ సస్సెక్స్ రాజ బిరుదులను విడిచిపెట్టినట్లు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
చరిత్రలో ఈరోజు.. తొలి వన్డే వరల్డ్ కప్ ప్రారంభం
రుతుపవనాల ప్రభావం : శ్రీలంక జలమయం, 14 మంది మృతి
నీట్, జేఈఈ మెయిన్స్ : వచ్చే వారం షెడ్యూల్ విడుదల..!
ఇమ్రాన్ మాట : భారత్‌తో చర్చలకు సిద్ధమే, కానీ..
అదే స్వరం : కొవిడ్‌కు చైనాదే బాధ్యత అన్న ట్రంప్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

