ఇమ్యూనిటీ బూస్టర్ : పనస గింజల్లో దాగి ఉన్న ఆరోగ్యం
పండు తొనల్లో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. అదేవిధంగా, కాల్షియం, పొటాషియం, మెగ్నిషియం, జింక్ వంటి పోషకాలు విరివిగా లభిస్తాయి. అలసట తగ్గడంతోపాటు చర్మ సౌందర్యం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది

మనం ఆరోగ్యంగా ఉండేందుకు పండ్లు దోహదపడుతుంటాయి. మనం అన్ని పండ్లను తింటూ వాటిలోని గింజలను మాత్రం పారేస్తుంటాం. కొన్ని పండ్ల గింజల ప్రయోజనాలు తెలియక వాటిని తినకుండా ఉంటాం. పనస పండు గింజలు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను దాచుకుని ఉంటుంది. పనస పండును తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పండు తొనల్లో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. అదేవిధంగా, కాల్షియం, పొటాషియం, మెగ్నిషియం, జింక్ వంటి పోషకాలు విరివిగా లభిస్తాయి. అలసట తగ్గడంతోపాటు చర్మ సౌందర్యం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అయితే, పనస పండు గింజలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.
ఐరన్ పుష్కలం..
పనస గింజల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల శరీరానికి ఐరన్ లభించి రక్తహీనత సమస్య నుంచి గట్టెక్కవచ్చు. రక్త వృద్ధి కూడా జరుగుతుంది. వీటిని తినేవారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటి వల్ల ఇమ్యూనిటీ పవర్ చాలా పెంచుకోవచ్చు.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది..
శరీర జీర్ణక్రియ సాఫీగా జరిగేందుకు పనస గింజలు దివ్య ఔషధంగా పనిచేస్తాయి. జీర్ణక్రియ సమస్యలతో శరీరం బరువుగా అనిపిస్తుంది. అలాంటప్పుడు పనసపండు గింజలను ఉడికించి తింటే ఆహారం త్వరగా జీర్ణమై అజీర్తి సమస్యలు దూరమవుతాయి.
బలమైన కురుల కోసం..
మహిళలు పొడవాటి జుట్టును కోరుకుంటుంటారు. పని ఒత్తిడి వల్ల చాలా మందిలో జుట్టు రాలిపోతుంటుంది. అలాంటి వారికి పనస గింజలు అధిక మేలు చేస్తాయి.
కంటి సమస్యలు మాయం..
ఆధునిక చదువులతో చిన్నారులకే కళ్లద్దాలు వస్తున్నాయి. టీవీ, మొబైల్, కంప్యూటర్ చూడటం వల్ల కళ్లకు ఎక్కువ ఒత్తిడి కలిగి కంటి సమస్యలు పెరుగుతున్నాయి. కంటి ఆరోగ్యంపై దృష్టిపెట్టడానికి ముందు పనస గింజలను గుర్తుచేసుకోవాలి. కంటి సమస్యల పరిష్కారం కోసం మొలకెత్తిన పనస గింజలు తినాలి.
చర్మ ముడుతలు పోగొట్టాలంటే..
అందరూ యవ్వనంగా కనిపించేందుకు కనిపించిన క్రీములను రాసేస్తుంటారు. అయినా, చర్మం ముడుతలు తగ్గవు. చిన్న వయసులోనే ఎంతో వయసు వచ్చిన వారి మాదిరిగా కనిపిస్తుంటారు. ఇలాంటి వారు పనస పండు తినడం ద్వారా చర్మ సౌందర్యం పెంచుకోవచ్చు. అలాగే, పనస విత్తనాలను చూర్ణం చేసి పాలతో కలిపి తీసుకుంటే ముఖంపై ముడతలు తగ్గి ప్రకాశవంతంగా మారుతుంది.
లైంగిక సామర్థ్యం..
మనిషికి శృంగారం కూడా చాలా ముఖ్యం. పనస తొనలతోపాటు.. గింజలను ప్రతిరోజూ తింటే శృంగార సమస్యలను దూరం చేసుకోవచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు. అదేవిధంగా వీటిని నిత్యం తీసుకునే వారిలో ఎముకలతోపాటు దంతాలు గట్టిగా తయారవుతాయి. ఇన్ని ప్రయోజనాలున్న పనస గింజలను వృధాగా పారేయకండి.. వీటిని కూడా తిని ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి..!
ఇవి కూడా చదవండి..
ఫుల్ ట్రోలింగ్ : తొలి డోసు తీసుకున్న ములాయం
ఆధిపత్యం వద్దు : చైనా విశ్వవిద్యాలయం ఏర్పాటుపై ఆందోళన
జీ 7 సమ్మిట్ : గ్లోబల్ టాక్సేషన్ సిస్టంకు గ్రీన్‌సిగ్నల్
ICAI CA 2021: సవరించిన షెడ్యూల్ విడుదల
లిలిబెట్ డయానా : రెండోసారి తల్లిదండ్రులైన హ్యారీ, మేఘన్
చరిత్రలో ఈరోజు.. తొలి వన్డే వరల్డ్ కప్ ప్రారంభం
నీట్, జేఈఈ మెయిన్స్ : వచ్చే వారం షెడ్యూల్ విడుదల..!
ఇమ్రాన్ మాట : భారత్‌తో చర్చలకు సిద్ధమే, కానీ..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

