న్యూఢిల్లీ: ఒలింపిక్ షూటర్ మనూ భాకర్ తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ మెసేజ్ పోస్టు చేశారు. చెడు భాష గురించి ఆమె తన మెసేజ్‌లో యువతకు సందేశం ఇచ్చారు. చెడుగా మాట్లాడడం మానుకోవాలని ఆమె యువతను కోరారు. తిట్టుకోవడం, దుర్భాషలాడడం .. మంచి పద్దతి కాదు అని ఆమె అన్నారు. మీరు మాట్లాడే మాటలే మీ వ్యక్తిత్వాన్ని సూచిస్తాయన్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన షూటర్ మనూ భాకర్.. తన ఎక్స్ అకౌంట్లో సుదీర్ఘ సందేశాన్ని పోస్టు చేశారు. మీ భాషే మీ వ్యక్తిత్వాన్ని సూచిస్తుందని, మీరెలాంటి వాళ్లో చెబుతోందని, మీ పదాలను తెలివిగా ఎంచుకోవాలని, ఎందుంటే మీరు అనుకున్నట్లే మీరు తయారు అవుతారన్నారు.
చెడు భాషను వాడడం మంచి పద్ధతి కాదు అని, దుర్భాషలాడడం మానుకోవాలన్నారు. అలా చేస్తే నిర్మలంగా ఉండలేరన్నారు. కూల్‌గా ఉండడం అంటే హార్డ్ వర్క్ చేయడమే అని, దయతో ఉండాలని, ఇతరుల పట్ల గౌరవాన్ని చూపాలన్నారు. మంచితనంతో విజయం సాధించాలన్నారు. మీ పేరెంట్స్, దేశాన్ని గర్వంగా నిలపాలన్నారు. ఈ విషయాన్ని మీకెందుకు చెబుతున్నానంటే, గత కొన్నేళ్ల నుంచి .. చెడు భాషను వాడుతున్న తీరు మారిందన్నారు. చాలా మంది చాలా సాదాసీదాగా చెడు మాటలు మాట్లాడుతున్నారని, దాన్నే కూల్‌గా భావిస్తున్నారని, రోజువారీ మాటల్లో అమర్యాదకర భాషను వాడుతున్నట్లు షూటర్ మనూ భాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. తిట్టడం అంటే కూల్‌గా ఉండడం కాదన్నారు.
The language we choose reflects our personality and the kind of person we are. Choose your words wisely, because over time, you become what you think, what you speak, and what you practice.
Using bad language is not cool. Abusing is not cool.
Let’s keep the definition of cool… pic.twitter.com/8LN53t4V0h
— Manu Bhaker🇮🇳 (@realmanubhaker) August 2, 2026