ICAI CA 2021: సవరించిన షెడ్యూల్ విడుదల
ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) సీఏ ఫౌండేషన్ పరీక్షలను వాయిదా వేసింది. దీనితో పాటు జూలైలో జరుపతలపెట్టిన ఇంటర్మీడియట్, సీఏ ఫైనల్ పరీక్షల తేదీలను కూడా విడుదల చేసింది

న్యూఢిల్లీ : ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) సీఏ ఫౌండేషన్ పరీక్షలను వాయిదా వేసింది. దీనితో పాటు జూలైలో జరుపతలపెట్టిన ఇంటర్మీడియట్, సీఏ ఫైనల్ పరీక్షల తేదీలను కూడా విడుదల చేసింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం, సీఏ ఫౌండేషన్ పరీక్ష ఇప్పుడు జూలై 24 నుంచి ప్రారంభమవుతుంది. సీఏ ఇంటర్మీడియట్, ఫైనల్ పరీక్షలను (పాత, కొత్త కోర్సులకు) జూలై 6 నుంచి 20 వరకు జరుపనున్నారు. పాత, కొత్త కోర్సులకు తుది పరీక్షలు జూలై 5 నుంచి 19 వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ icaiexam.icai.org ద్వారా షెడ్యూల్‌ను చూడవచ్చు.
దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ఐసీఏఐ సీఏ ఫౌండేషన్ పరీక్షను వాయిదా వేసింది. అంతకుముందు ఈ పరీక్ష జూన్ 24, 26, 28, 30 తేదీలలో నిర్వహించవలసి ఉన్నది. ఇప్పుడు ఈ పరీక్ష జూలై 24 నుంచి జరుగుతుంది. 1 నుంచి 5 వరకు మాడ్యూళ్ళకు బీమా రిస్క్ మేనేజ్మెంట్ (ఐఆర్ఎం) సాంకేతిక పరీక్ష జూలై 5, 7, 9, 11 తేదీల్లో జరుగనున్నది.
రెండు షిఫ్టులలో పరీక్ష
పరీక్ష రెండు షిఫ్టులలో నిర్వహించనున్నారు. పేపర్ -1, పేపర్ -2 మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు, పేపర్ 3, 4 మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రం కోసం నగరాన్ని మార్చుకునేందుకు జూన్ 9 నుంచి జూన్ 11 వరకు విండోను తిరిగి తెరవనున్నట్లు ఐసీఏఐ తెలిపింది. అభ్యర్థులు icaiexam.icai.org ద్వారా పరీక్ష సెంటర్ నగరంలో మార్పులు చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి..
లిలిబెట్ డయానా : రెండోసారి తల్లిదండ్రులైన హ్యారీ, మేఘన్
చరిత్రలో ఈరోజు.. తొలి వన్డే వరల్డ్ కప్ ప్రారంభం
రుతుపవనాల ప్రభావం : శ్రీలంక జలమయం, 14 మంది మృతి
నీట్, జేఈఈ మెయిన్స్ : వచ్చే వారం షెడ్యూల్ విడుదల..!
ఇమ్రాన్ మాట : భారత్‌తో చర్చలకు సిద్ధమే, కానీ..
అదే స్వరం : కొవిడ్‌కు చైనాదే బాధ్యత అన్న ట్రంప్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

