పాకిస్తాన్లో బస్సు ప్రమాదం: 15 మంది మృతి
పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లో బస్సు లోయలో పడిపోయిన ఘటనలో 15 మంది మృతిచెందారు. మరో 35 మందికిపైగా గాయపడ్డారు. అతివేగంగా ప్రయాణిస్తూ అదుపుతప్పి లోయలో పడిపోయినట్లు క్షతగాత్రులు తెలిపారు

ఇస్లామాబాద్ : పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లో బస్సు లోయలో పడిపోయిన ఘటనలో 15 మంది మృతిచెందారు. మరో 35 మందికిపైగా గాయపడ్డారు. అతివేగంగా ప్రయాణిస్తూ అదుపుతప్పి లోయలో పడిపోయినట్లు క్షతగాత్రులు తెలిపారు. అటాక్ జిల్లాలోని హసన్ అబ్దుల్ ప్రాంతంలో మంగళవారం ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదానికి గురైన బస్సు లాహోర్ నుంచి ఖైబర్-పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని మర్దాన్కు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మరో కారును ఢీకొనకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్న సమయంలో బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దాంతో పక్కనే ఉన్న లోయలోకి బస్సు పడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులోని 15 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 35 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని బస్సులో నుంచి బయటకు తీసిన మోటార్ వే పోలీసులు, రెస్క్యూ అధికారులు.. వారిని ప్రాథమిక చికిత్స అందించేందుకు సమీపంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో రావల్పిండి దవాఖానకు తరలించారు.
ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి ప్రత్యేక సహాయకుడు సయీద్ జుల్ఫికర్ అబ్బాస్ బుఖారీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు సహాయం అందించేలా స్థానిక అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
పాకిస్తాన్లో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. సరిగా నిర్వహణ లేని రోడ్లు, అజాగ్రత్త డ్రైవింగ్ కారణంగా తరచుగా పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
‘రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయిస్తారు’: నందిగ్రామ్ ఓట్ల లెక్కింపుపై ఈసీ
సంకీర్ణం ఏర్పాటులో నెతన్యాహు విఫలం.. ప్రతిపక్షంలో కూర్చునేందుకు సిద్ధం
మయన్మార్‌లో పార్సిల్ బాంబు పేలుడు, ఎంపీ సహా ఐదుగురు మృతి
ఈ ఏడాది చివర్లో అందుబాటులోకి 5 జీ సేవలు..?
పడిపోయిన ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ
ప్రపంచంలో అత్యంత ఖరీదైన విడాకులు.. ఇవే
భారతదేశం సేవలు అజరామరం : హార్వర్డ్ ప్రొఫెసర్ జెస్సీ బంప్
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షం.. బురదలో కూరుకుపోయిన ఇండ్లు
తొలి మహిళా న్యాయమూర్తి అన్నా చాందీ.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

