Rabbit farm : జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) రాష్ట్రం బారాముల్లా జిల్లా (Baramulla district) లోని పట్టన్ (Pattan) పట్టణంలో అతిపెద్ద అంగోరా రాబిట్ ఫామ్ (Angora Rabbit Farm) ను ఏర్పాటు చేశారు. ఈ రాబిట్ ఫామ్ పిల్లలను, పెద్దలను, యువతను ఎంతో ఆకట్టుకుంటోంది. జనం పెద్ద సంఖ్యలో ఈ ఫామ్‌ను సందర్శిస్తున్నారు. ఫామ్‌లోని రకరకాల కుందేళ్లు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి.
ఈ ఫామ్‌కు సంబంధించిన వివరాలను జమ్ముకశ్మీర్ పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వసీం ముజఫర్ మాలిక్ కొన్ని వివరాలను వెల్లడించారు. తమ దగ్గర మొత్తం 727 కుందేళ్లు ఉన్నాయని ఆయన చెప్పారు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం మాత్రమే ఎదురు చూడకుండా కుందేళ్ల ఫామ్ పెట్టుకుని ఉపాధి పొందవచ్చని ఆయన అన్నారు. ఈ ఫామ్ నుంచి కొందరు పెంచుకునేందుకు, కొందరు మాంసం కోసం కుందేళ్లను తీసుకువెళ్తుంటారని ఆయన చెప్పారు.
ఈ రాబిట్ ఫామ్‌కు మంచి స్పందన ఉందని, పిల్లలు తమ పేరెంట్స్‌ను తీసుకుని వచ్చి ఫామ్‌ను సందర్శిస్తున్నారని వసీం తెలిపారు. ఈ ఫామ్‌లను విస్తరింపజేస్తే నిరుద్యోగం కచ్చితంగా తగ్గుతుందని అన్నారు. ఫామ్‌ను ఏర్పాటు చేయదల్చుకున్న వాళ్లు తమను సంప్రదించవచ్చని చెప్పారు. కనువిందు చేస్తున్న రకరకాల కుందేళ్లను కింది వీడియోలో చూడవచ్చు..
#WATCH | Baramulla, J&K | Sheep Husbandry Department Assistant Director, Dr Waseem Muzaffar Malik says, “… We have 727 livestock at present, and the objective is to decrease employment that is on the rise… Other than that, we sell livestock as pets, people also buy them for… https://t.co/4w1xR5jNfw pic.twitter.com/8izhO7MMUX
— ANI (@ANI) February 18, 2025
Mahakumbh | కుటుంబంతో కలిసి పుణ్యస్నానం చేసిన పవన్ కళ్యాణ్.. Video
Ashley clair | ఆయనతో సంబంధం అలా మొదలైంది.. ఎలాన్ మస్క్‌తో రిలేషన్‌పై అష్లీ క్లెయిర్
USA | అక్కడ సజీవంగా 360 ఏళ్ల వ్యక్తి.. 200 ఏళ్లు దాటినవాళ్లూ 2 వేల మంది..!
Health Tips | నిద్రలో కాళ్లూచేతులు పట్టేస్తున్నాయా.. అయితే ఇలా చేయండి!
Plane Crash | తలకిందులైంది.. రన్‌వేపై అదుపుతప్పి బోల్తా పడిన విమానం
High Court | హైడ్రా చర్యలు చట్టవ్యతిరేకం.. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం: హైకోర్టు