Health Tips | నిద్రలో తలెత్తే శారీరక సమస్యల్లో చేతులు, కాళ్లు మొద్దుబారినట్టు అనిపించడం చాలామందికి అనుభవమే. తాత్కాలికమే అయినప్పటికీ, తరచుగా జరుగుతుంటే మాత్రం దీన్ని సీరియస్‌గానే తీసుకోవాలి. చేతులు, కాళ్లు మొద్దుబారినప్పుడు జలదరింపుగా, పొడుస్తున్నట్టుగా, మంటగా ఉంటుంది. దీంతో నిద్రకు ఆటంకం కలుగుతుంది. నరాల మీద ఒత్తిడి కారణంగా, రక్త సరఫరాలో ఆటంకం వల్ల, ఇతర అనారోగ్య సమస్యల కారణంగా ఇలా జరగవచ్చు.
సాధారణంగా ఒకే భంగిమలో ఎక్కువసేపు నిద్రించడం, మధుమేహం, విటమిన్లు లోపించడం, నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు లాంటివి చేతులు, కాళ్లు మొద్దుబారడానికి ముఖ్య కారణాలు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను అవగాహన చేసుకుందాం. తప్పుడు నిద్రా భంగిమ ఒకే భంగిమలో ఎక్కువసేపు నిద్రపోతే నరాల మీద, రక్త సరఫరా మీద ఒత్తిడి పెరుగుతుంది. ఇది చేతులు, కాళ్లు మొద్దుబారేలా చేస్తుంది.
దిండు, పరుపు మరీ మెత్తగా కానీ, మరీ గట్టిగా కానీ ఉండకూడదు. తరచుగా నిద్ర భంగిమను మారుస్తూ ఉండాలి.
నాడుల మీద ఒత్తిడి కూడా వాటి సాధారణ పనితీరుకు ఆటంకం కలిగిస్తుంది. దాంతో తిమ్మిరిగా, మొద్దుబారినట్టుగా అనిపిస్తుంది.
ఎక్కువ సమయంపాటు ఒకే దగ్గర కూర్చోవడం, ఒకే భంగిమలో పడుకోవడం చేయకూడదు. శరీరంపై ఒత్తిడి పడకుండా తేలికపాటి వ్యాయామాలు చేస్తూ ఉండాలి. సమస్య తగ్గకపోతే మాత్రం వైద్యుణ్ని
సంప్రదించాలి.
శరీరంలో ఏదైనా భాగానికి రక్తం తగినంతగా సరఫరా కాకపోయినా, సంబంధిత అవయవం మొద్దుబారినట్టుగా అనిపిస్తుంది. దీనికి కారణాలు..
రక్త సరఫరా మెరుగుపడటానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. సమతులాహారం తీసుకోవాలి. ధూమపానం, మద్యపానం వదిలిపెట్టాలి.
శరీరంలో కొన్ని అత్యావశ్యక పోషకాలు లోపించినా కూడా చేతులు, కాళ్లు మొద్దుబారే సమస్య వస్తుంది. ముఖ్యంగా, విటమిన్ బి12, బి6, మెగ్నీషియం లోపాలు నాడుల పనితీరును ప్రభావితం చేస్తాయి. ఈ లోపం అలాగే కొనసాగితే నాడీ వ్యవస్థ బలహీనంగా మారుతుంది. ఇది చేతులు, కాళ్లలో మొద్దుబారే సమస్యను పెంచుతుంది.
తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, గింజలు, పాల పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. అవసరం అనుకుంటే డాక్టర్ల సూచన మేరకు విటమిన్ బి12, మెగ్నీషియం సప్లిమెంట్లు తీసుకోవాలి. ప్రాసెస్డ్ ఆహార పదార్థాలు, జంక్‌ఫుడ్ మోతాదుకు మించి తినడమూ మానుకోవాలి.