USA | అక్కడ సజీవంగా 360 ఏళ్ల వ్యక్తి.. 200 ఏళ్లు దాటినవాళ్లూ 2 వేల మంది..!
USA | అమెరికా (USA) లో వందల ఏళ్ల వయసున్న వ్యక్తులు ఇప్పటికీ సజీవంగా ఉన్నారట. వారిలో ఒక వ్యక్తి వయసు ఏకంగా 360 ఏళ్లకు పైగా ఉందట. ఇక 200 ఏళ్ల వయసు దాటిన వారు రెండు వేల మందికి పైగా ఉన్నారట.
USA : అగ్రరాజ్యం అమెరికా (USA) లో వందల ఏళ్ల వయసున్న వ్యక్తులు ఇప్పటికీ సజీవంగా ఉన్నారట. వారిలో ఒక వ్యక్తి వయసు ఏకంగా 360 ఏళ్లకు పైగా ఉందట. ఇక 200 ఏళ్ల వయసు దాటిన వారు రెండు వేల మందికి పైగా ఉన్నారట. అమెరికా సోషల్ సెక్యూరిటీ (Social Security) డేటా విభాగం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. దీన్ని టెస్లా సీఈవో (Tesla CEO) ఎలాన్ మస్క్ (Elon Musk) నేతృత్వంలోని ప్రభుత్వం విభాగం డోజ్ (DOGE) ధ్రువీకరించింది.
తాజాగా ఎలాన్ మస్క్ ఆ విషయాన్ని ఎక్స్‌లో పంచుకున్నారు. అమెరికాలోని సోషల్ సెక్యూరిటీ అర్హుల జాబితాలో వందేళ్లు దాటిన దాదాపు 2 కోట్ల మంది ఇప్పటికీ సజీవంగా ఉన్నట్టుగా ఉందని, అది అమెరికాలోని ప్రస్తుత పౌరుల సంఖ్య కంటే అధికమని మస్క్ పేర్కొన్నారు. చరిత్రలోనే ఇది అతి పెద్ద మోసమని రాశారు. వాస్తవానికి 2023లో సోషల్ సెక్యూరిటీ ఆడిట్లో దాదాపు 18.9 మిలియన్ల మంది వందేళ్లు దాటిన వారి పేర్లు ఉన్నట్లు గుర్తించారు.
వారు ఆదాయం పొందడంగానీ, ఎలాంటి లబ్ధిలను స్వీకరించడంగానీ చేయడం లేదని తేల్చారు. అయినా ఆ జాబితాను ఇప్పటికీ సవరించలేదు. 112 ఏళ్ల వయసు దాటిన 65 లక్షల మంది మరణించినా సెక్యూరిటీ నెంబర్లను కలిగి ఉన్నారు. కానీ వారికి సంబంధించి ఎలాంటి డెత్ ఇన్ఫర్మేషన్ నమోదు చేయలేదు. వాళ్లంతా ఎలక్ట్రానిక్ డెత్ ఇన్ఫర్మేషన్ నమోదు వ్యవస్థ రాకముందే ప్రాణాలు కోల్పోయారు.
వాస్తవానికి అమెరికాలో ఇప్పుడు కేవలం 35 మంది మాత్రమే 112 ఏళ్ల వయస్సు దాటినవాళ్లు ఉన్నారు. అమెరికా జనాభా లెక్కల ప్రకారం.. అక్కడ 100 ఏళ్లు దాటిన వృద్ధుల సంఖ్య కేవలం 86 వేలు మాత్రమే ఉంది. ఇదిలావుంటే అమెరికాలోని సోషల్ సెక్యూరిటీ అడ్మిన్‌స్ట్రేషన్.. రిటైర్మెంట్ తీసుకున్న వారికి, వైకల్యంతో బాధపడే వారికి ఆదాయ మార్గాలను సమకూరుస్తుంది.
అమెరికాలో ట్రేజరీ డిపార్ట్మెంట్ నుంచి చెల్లించిన 4.7 ట్రిలియన్ డాలర్లకు టాస్ కోడ్ లేదని డోజ్ అధిపతి ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. దాంతో ఆ నిధులు ఎటు వెళ్లాయో గుర్తించడం అసాధ్యమని చెప్పారు. వాస్తవానికి ఈ టాస్ కోడ్ వాడటం ఇప్పటి వరకు ఒక ఆప్షనల్ మాత్రమేనని, కానీ తాజాగా డోజ్ లోపాలను గుర్తించడంతో టాస్ కోడ్ వాడటం తప్పనిసరి చేశామని మస్క్ వెల్లడించారు.
డొనాల్డ్ ట్రంప్ కార్యవర్గం ఇటీవలే మస్క్ నేతృత్వంలోని డోజ్‌కు ట్రెజరీ డిపార్ట్మెంట్ సమాచారం చూసేందుకు యాక్సెస్ ఇచ్చింది. డోజ్ తాజాగా సెక్యూరిటీ విభాగం డేటాలో లోపాలను గుర్తించడంతో టాస్ కోడ్ వాడటం తప్పనిసరి చేశారు. అమెరికా రెవెన్యూ డిపార్ట్మెంట్లో పన్ను చెల్లింపుదారుల డేటాలో కూడా తమకు యాక్సెస్ ఇవ్వాలని తాజాగా డోజ్ కోరింది. ప్రభుత్వం నుంచి ఆ అనుమతి కూడా లభిస్తే అమెరికాలో పన్ను చెల్లింపుదారులు, బ్యాంకులు ఇతర సున్నితమైన డేటా మొత్తం డోజ్ చేతికి వస్తుంది.
Bruh, if I wanted to rummage through random personal shit, I could have done that at PAYPAL. Hello???
Having tens of millions of people marked in Social Security as “ALIVE” when they are definitely dead is a HUGE problem.
Obviously.
Some of these people would have been alive… https://t.co/L17rSBR1Tb pic.twitter.com/6hBqAJ5TbF
— Elon Musk (@elonmusk) February 17, 2025
ఇవి కూడా చదవండి..
Health Tips | నిద్రలో కాళ్లూచేతులు పట్టేస్తున్నాయా.. అయితే ఇలా చేయండి!
Plane Crash | తలకిందులైంది.. రన్‌వేపై అదుపుతప్పి బోల్తా పడిన విమానం
High Court | హైడ్రా చర్యలు చట్టవ్యతిరేకం.. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం: హైకోర్టు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

