టొరంటో: మరో విమాన ప్రమాదం (Plane Crash) జరిగింది. అయితే అమెరికాలో కాదు.. ఈసారి దాని పొరుగునే ఉన్న కెనడాలో. సోమవారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండ్ అయిన తర్వాత రన్‌వేపై అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో 18 మంది గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అదికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో విమానంలో 80 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. క్షతగాత్రులను దగ్గరల్లోనే దవాఖానకు తరలించారు. గాయపడిన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. ప్రాణ నష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
#Update: Delta Airlines plane flips upside down in Toronto crash, 15 wounded.
◾Plane Carrying 80 passenger including 4 Crew flipping upside down on the tarmac at Pearson International Airport.#Toronto #PlaneCrashed #canada #DeltaAirlines #PlaneCrash #USA #Pearson #Minneapolis… pic.twitter.com/30hqAjquza
— DW Samachar (@dwsamachar) February 17, 2025
డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం అమెరికాలోని మిన్నె పొలిస్ నుంచి టొరంటోకు వచ్చింది. పియర్సన్ ఎయిర్‌పోర్టులో రన్‌వేపై దిగిన విమానం అదుపుతప్పి బోల్తా పడిందని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదం కారణంగా 40కిపైగా విమానాల రాకపోకలపై ప్రభావం పడింది. విమానాలు ఆలస్యంగా నడుస్తాయని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
#planecrash Delta Airlines plane flips upside down in Toronto crash, 15 wounded.
◾Plane Carrying 80 passenger including 4 Crew flipping upside down on the tarmac at Pearson International Airport.#Toronto #PlaneCrashed #canada #DeltaAirlines #USA #Pearson #Minneapolis #Ontario pic.twitter.com/6nhCbqbQSM— Veeresh Kumar (@VeereshKum9526) February 18, 2025
Passengers exiting Delta plane that flipped upon landing in Toronto, Canada today.
18 people have reportedly been taken to the hospital, no casualties. pic.twitter.com/een2Odm8BG
— Pop Crave (@PopCrave) February 17, 2025