Ashley clair : నా ఐదు నెలల బిడ్డకు టెస్లా చీఫ్ (Tesla Chief) ఎలాన్ మస్కే (Elon Musk) తండ్రి అని చెప్పి సంచలనం రేపిన రచయిత్రి అష్లీ సెయింట్ క్లెయిర్ (Ashley St Clair).. ఇప్పుడు మస్క్‌తో తన సంబంధం (Relation) ఎలా మొదలైందనే వివరాలను వెల్లడించింది. ఎలాన్ మస్క్ చాలా ఫన్నీగా ఉంటాడని 26 ఏళ్ల అష్లీ క్లెయిర్ చెప్పింది. ఆయన చాలా తెలివైన వ్యక్తని, సాదాసీదాగా ఉంటాడని, అందుకే ఆయన తన కలల్లోకి వచ్చాడని క్లెయిర్ పేర్కొంది.
‘ఎప్పుడైనా శాన్ ఫ్రాన్సిస్కోకుగానీ, ఆస్టిన్కుగానీ వచ్చావా..?’ అని ఒకానొక సందర్భంలో మస్క్ తనను అడిగాడని, దాంతో ‘బాబీలోన్ బీ’ వెబ్‌సైట్‌కు పనిచేసిన సమయంలో పని నిమిత్తం తాను తరచూ ఆస్టిన్‌కు, టెక్సాస్‌కు వస్తూ ఉండేదాన్నని చెప్పానని అష్లీ క్లెయిర్ తెలిపింది. ఆ తర్వాత తాను మస్క్‌ను ఇంటర్వ్యూ చేసేందుకు శాన్ఫ్రాన్సిస్కోకు వెళ్లానని, ఇంటర్వ్యూ తర్వాత తమ ఇద్దరి మధ్య రొమాన్స్ మొదలైందని క్లెయిర్ చెప్పింది. ఆ తర్వాత మస్క్ నుంచి తన మొబైల్‌కు ఒక సందేశం వచ్చిందని, ‘ఈ రాత్రికి రోడ్ ఐలాండ్‌కు వెళ్తున్నాం’ అనేది ఆ సందేశం సారాంశమని ఆమె వెల్లడించింది.
అలా మొదలైన తమ సంబంధం తాను గర్భం దాల్చే దాకా కొనసాగిందని క్లెయిర్ తెలిపింది. ఆ తర్వాత విషయం బయటికి రావద్దని మస్క్ తనను కోరాడని, అందుకే తన దగ్గరి వాళ్లతో మినహా మరెవ్వరికీ తన గర్భం గురించి తెలియకుండా జాగ్రత్త పడ్డానని ఆమె చెప్పింది. ప్రస్తుతం మస్క్ తనకు ఓ లగ్జరీ అపార్టుమెంట్, భారీగా ఆర్థిక భద్రత కల్పించారని.. కానీ ఇద్దరి మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేదని పేర్కొంది.
ఇప్పటికి కూడా తాను మస్క్‌తో కొడుకును కన్న విషయాన్ని రహస్యంగా ఉంచుదామని అనుకున్నానని, కానీ మీడియా తనను బెదిరించి విషయాన్ని బయటపెట్టేలా చేసిందని అష్లీ సెయింట్ క్లెయిర్ వెల్లడించింది. మీడియా బెదిరింపులతో విషయాన్ని బయటపెట్టినందుకు తనకు బాధగా ఉందని చెప్పింది. అయితే విషయం బయటకు రావడంతో తనకు ఒక రకమైన రిలీఫ్ దక్కిందని, రహస్యంగా జీవించాల్సిన దుస్థితి పోయిందని పేర్కొంది.
కాగా, ఎలాన్ మస్క్‌తో కలిసి తాను ఓ బిడ్డకు జన్మనిచ్చినట్లు క్లెయిర్ ఇటీవల ఆరోపించింది. ఆ బిడ్డ మస్క్‌కు 13వ సంతానమని తెలిపింది. తమ చిన్నారి గోప్యతకు ఎవరూ భంగం కలిగించొద్దని ఆమె వేడుకుంది. తన బిడ్డను సురక్షితంగా పెంచేందుకు కృషి చేస్తానని చెప్పింది. కాగా, క్లెయిర్ ఒక రచయిత్రి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. తాను రాసిన ‘ఎలిఫెంట్స్ ఆర్ నాట్ బర్డ్స్’ అనే పుస్తకంతో ఆమెకు పేరు తెచ్చింది. అయితే అష్లే క్లెయిర్ ఆరోపణలపై ఎలాన్ మస్క్ ఇంతవరకు అవుననిగానీ, కాదనిగానీ స్పందించలేదు.
USA | అక్కడ సజీవంగా 360 ఏళ్ల వ్యక్తి.. 200 ఏళ్లు దాటినవాళ్లూ 2 వేల మంది..!
Health Tips | నిద్రలో కాళ్లూచేతులు పట్టేస్తున్నాయా.. అయితే ఇలా చేయండి!
Plane Crash | తలకిందులైంది.. రన్‌వేపై అదుపుతప్పి బోల్తా పడిన విమానం
High Court | హైడ్రా చర్యలు చట్టవ్యతిరేకం.. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం: హైకోర్టు