Mahakumbh : ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj) లో గత నెల రోజులుగా మహా కుంభమేళా (Mahakumbh) జరుగుతోంది. జనవరి 13న ప్రారంభమైన ఈ మహాకుంభమేళా ఫిబ్రవరి 26న ముగియనుంది. ఇప్పటికే 35 రోజుల్లో 55 కోట్ల మందికిపైగా భక్తులు ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. మరో వారం రోజుల్లో మహాకుంభమేళా ముగియనుండటంతో భక్తుల తాకిడి మరింత పెరిగింది. రోజుకు కోటి మందికిపైగా భక్తులు నదీ స్నానాలకు వస్తున్నారు.
ఈ నేపథ్యంలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (Central Pollution Control Board – CPCB) జాతీయ హరిత ట్రిబ్యునల్ (National Green Tribunal – NGT) కు సమర్పించిన నివేదిక ఆందోళన కలిగిస్తున్నది. ప్రయాగ్‌రాజ్‌లోని పలు చోట్ల నదీ జలాలు కలుషితమయ్యాయని.. ఆ నీళ్లలో మానవ, జంతు మల సంబంధమైన కోలీఫామ్ బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోయిందని, దాంతో ప్రయాగ్‌రాజ్ ప్రాంతంలోని గంగా, యమునా నదీ జలాల్లో స్నానాలకు కావాల్సిన ప్రమాణాలు లేవని NGT కి సమర్పించిన నివేదికలో CPCB పేర్కొన్నది.
మహాకుంభమేళా సందర్భంగా కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలకు తరలివస్తుండటంతో ప్రయాగ్‌రాజ్‌లో జంతు, మానవ సంబంధ వ్యర్థాలు పెరిగిపోతున్నాయని, అదే మల సంబంధ కోలిఫామ్ బ్యాక్టీరియా స్థాయికి మించి పెరగడానికి కారణమవుతోందని NGT కి CPCB తెలియజేసింది. ఒక 100 మిల్లీలీటర్ల నీటిలో 2,500 కోలిఫామ్ బ్యాక్టీరియాలు ఉన్నా ఆ నీరు స్నానానికి యోగ్యమైనదేనని, అంతకుమించి ఉంటే చర్మ సంబంధ అనారోగ్యాలు తలెత్తుతాయని పేర్కొంది.
ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యమునా నదుల్లో మురుగు నీటిని, వ్యర్థాలను వదలకుండా నిరోధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ, జస్టిస్ శ్రీధర్ అగర్వాల్, జస్టిస్ ఎ సెంథిల్ వేల్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ నెల 3న CPCB సమర్పించిన నివేదికను పరిశీలించిన NGT బెంచ్.. కాలుష్యాన్ని నియంత్రించడంలో ఉత్తరప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విఫలమైందని వ్యాఖ్యానించింది. పిటిషన్‌పై తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు.
USA | అక్కడ సజీవంగా 360 ఏళ్ల వ్యక్తి.. 200 ఏళ్లు దాటినవాళ్లూ 2 వేల మంది..!
Health Tips | నిద్రలో కాళ్లూచేతులు పట్టేస్తున్నాయా.. అయితే ఇలా చేయండి!
Plane Crash | తలకిందులైంది.. రన్‌వేపై అదుపుతప్పి బోల్తా పడిన విమానం
High Court | హైడ్రా చర్యలు చట్టవ్యతిరేకం.. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం: హైకోర్టు