Fire accident : ఫర్నీచర్ గోదాము (Furniture Godown) లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ముందుగా స్క్రాప్ షాపు (Scrap shop) లో చెలరేగిన మంటలు తర్వాత పక్కనే ఉన్న ఫర్నీచర్ గోదాముకు అంటుకున్నాయి. మహారాష్ట్ర (Maharastra) లోని పుణె (Pune) నగరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గోదాములోని ఫర్నీచర్‌కు మంటలు అంటుకోవడంతో పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
పుణెలోని చించ్వాడ్ నగర్ ఏరియా జరిగిన ఈ ప్రమాదం గురించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేసింది. ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం సంభవించిందని అధికారులు తెలిపారు. ప్రమాదానికిగల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.
#WATCH | Pune, Maharashtra | Fire broke out in a scrap shop and furniture warehouse in Chinchwad Nagar, Pune. Firefighting operations are underway. No casualties reported so far. Further details awaited pic.twitter.com/PGuDLeBrnw
— ANI (@ANI) June 15, 2025