Fire accident : బాబా డెంబ్ (Baba Demb) ప్రాంతంలో మళ్లీ అగ్నిప్రమాదం (Fire accident) చోటుచేసుకుంది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లోని శ్రీనగర్ సిటీ (Srinagar city) లో ఈ బాబా డెంబ్ ఏరియా ఉంది. బాబా డెంబ్ సరస్సు పక్కనున్న అటవీ ప్రాంతంలో ఈ మధ్య తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
ఆ క్రమంలోనే ఇవాళ మరోసారి అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు. కాగా ఆ ప్రాంతంలో తరచూ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
#WATCH | Jammu and Kashmir: Fire broke out at Baba Demb in Srinagar; more details awaited pic.twitter.com/YJVg6c35sd
— ANI (@ANI) February 18, 2025
Ashley clair | ఆయనతో సంబంధం అలా మొదలైంది.. ఎలాన్ మస్క్‌తో రిలేషన్‌పై అష్లీ క్లెయిర్
USA | అక్కడ సజీవంగా 360 ఏళ్ల వ్యక్తి.. 200 ఏళ్లు దాటినవాళ్లూ 2 వేల మంది..!
Health Tips | నిద్రలో కాళ్లూచేతులు పట్టేస్తున్నాయా.. అయితే ఇలా చేయండి!
Plane Crash | తలకిందులైంది.. రన్‌వేపై అదుపుతప్పి బోల్తా పడిన విమానం
High Court | హైడ్రా చర్యలు చట్టవ్యతిరేకం.. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం: హైకోర్టు