శుక్రవారం 15 జనవరి 2021
National - Dec 24, 2020 , 13:42:05

ఏసీల్లో కూర్చుని ట్వీట్లు చేసే నేత‌ను కాలేను: ఊర్మిళ

ఏసీల్లో కూర్చుని ట్వీట్లు చేసే నేత‌ను కాలేను: ఊర్మిళ

హైద‌రాబాద్‌: బాలీవుడ్ న‌టి ఊర్మిళ ఇటీవ‌ల శివ‌సేన పార్టీలో చేరిన విష‌యం తెలిసిందే.  గ‌త లోక్‌స‌భ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌పున పోటీ చేసి ఓడిన ఆమె.. ఈమ‌ధ్యే పార్టీ మారారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన ఊర్మిళ‌.. శివ‌సేన పార్టీ నుంచి ప్ర‌స్తుతం మ‌హారాష్ట్ర మండ‌లి కోసం పోటీలో ఉన్నారు.  అయితే త‌న‌కు ఏసీల్లో కూర్చుని ట్వీట్లు చేసే నేత‌లాగా మారాల‌ని లేద‌ని ఊర్మిళ అన్నారు. ఉద్ద‌వ్ ఠాక్రే నేతృత్వంలోని ప్ర‌భుత్వం అద్భుతంగా ఉంద‌ని,  కోవిడ్ మ‌హ‌మ్మారి వేళ ప్ర‌భుత్వం తీసుకున్న సంక్షేమ చ‌ర్య‌లు అసాధార‌ణ‌మైన‌వ‌ని ఆమె అన్నారు. సెక్యూల‌ర్ అన్న భావాల‌కు అర్ధాలు మారాయ‌ని, సెక్యూల‌ర్ అన్నంత మాత్రాన మ‌రో మ‌తంపై న‌మ్మ‌కం లేద‌ని కాదు అని,  హిందువుగా ఉన్నంత మాత్రాన మ‌రో మ‌తాన్ని ద్వేషించ‌లేమ‌ని, శివ‌సేన అనేది హిందుత్వ పార్టీ అని,  హిందూ మ‌తం గొప్ప‌ద‌ని ఊర్మిళ అన్నారు.  ప్ర‌జా నేత కావాల‌న్న‌దే త‌న ల‌క్ష్య‌మ‌ని, తాను ఎలా అయితే అభిమానుల‌తో సినీ స్టార్‌గా మారానో అలాగే ప్ర‌జా నాయ‌కురాలు అనిపించుకోవాల‌ని ఉంద‌న్నారు. ఏసీల్లో కూర్చుని ట్వీట్లు చేయ‌డం కాదు, ఏం చేయాలి, ఎలా చేయాలో తెలుస‌ని, తానెప్పుడూ నేర్చుకుంటూనే ఉంటాన‌ని ఆమె అన్నారు.