ఆదివాసీ జిల్లా జోలికొస్తే ఊరుకోం
రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల కుదింపు యోచనలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆసిఫాబాద్ జిల్లా జోలికొస్తే ఊరుకునేది లేదని, కుమ్రం భీం స్ఫూర్తితో ఉద్యమిస్తామని ఎమ్మెల్యే కోవ లక్ష్మి స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
- కుమ్రం భీం స్ఫూర్తితో ఉద్యమిస్తాం
- ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి
ఆసిఫాబాద్ టౌన్,మే 3 : రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల కుదింపు యోచనలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆసిఫాబాద్ జిల్లా జోలికొస్తే ఊరుకునేది లేదని, కుమ్రం భీం స్ఫూర్తితో ఉద్యమిస్తామని ఎమ్మెల్యే కోవ లక్ష్మి స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాను తొలగిస్తే కాంగ్రెస్ పార్టీ నేతలు జిల్లాలో తిరగలేరని హెచ్చరించారు. జిల్లాల కుదింపు ఆలోచన మానుకోవాలని సూచించారు.
జిల్లా ఏర్పాటు తర్వాత ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందని, జిల్లాను తొలగిస్తే అభివృద్ధి కుంటుపడి ఆదివాసులకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. మోసపూరిత గ్యారెంటీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం పకదోవ పట్టించే కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. కుమ్రం భీం ప్రాజెక్టు నిర్మాణం కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని, దాని నాణ్యతా లోపానికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యులన్నారు.
కాలువలు పూర్తికాకముందే అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించిన విషయం మర్చిపోయారా అని గుర్తు చేశారు. ప్రజా పాలన పేరుతో ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటేనే అభివృద్ధి చేస్తారా&లేకుంటే చేయరా అని సీఎం ను ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి జిల్లా అభివృద్ధికి ఎలాంటి హామీ ఇచ్చారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ అలీబిన్ అహ్మద్, నాయకులు అహ్మద్, వెంకన్న, కార్తీక్, అశోక్, ఇర్ఫాన్, నిసార్ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

