కోటపల్లి, మే 3 : కోటపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1989-1990 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు శుక్రవారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. 34 ఏళ్ల తర్వాత విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒకే వేదికపైకి చేరి సంతోషంగా గడిపారు.
నాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు సన్మానించారు. అలాగే 2003-2004లో పదో తరగతి చదివిన విద్యార్థుల ఉపాధ్యాయులను సత్కరించారు.