గ్యాస్ గీజర్ ఎంత భద్రం.. నిత్యకృత్యంగా మారిన గ్యాస్ గీజర్ ప్రమాదాలు
గ్యాస్ గీజర్ వాడటంతో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి ఊపిరాడక యూపీలో దంపతులు మృతి. గ్యాస్ గీజర్ నుంచి గ్యాస్ లీకై ఊపిరి అందక కర్ణాటకలో అక్కాచెల్లెళ్ల దుర్మరణం. గ్యాస్ గీజర్ కారణంగా ముంబైలో వృద్ధ దంపతులు మృతి.. గ్యాస్ గీజర్ ప్రమాదాలకు సంబంధించి రోజూ ఇలాంటి వార్తలు నిత్యకృత్యంగా మారాయి.
- వెంటిలేషన్ లేని చిన్న బాత్రూమ్లతోనే సమస్య
- కార్బన్ మోనాక్సైడ్ విడుదలతో అపస్మారక స్థితికి
- సిలిండర్, మెషీన్‌ను బయటే ఉంచాలి: నిపుణులు
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : గ్యాస్ గీజర్ వాడటంతో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి ఊపిరాడక యూపీలో దంపతులు మృతి. గ్యాస్ గీజర్ నుంచి గ్యాస్ లీకై ఊపిరి అందక కర్ణాటకలో అక్కాచెల్లెళ్ల దుర్మరణం. గ్యాస్ గీజర్ కారణంగా ముంబైలో వృద్ధ దంపతులు మృతి.. గ్యాస్ గీజర్ ప్రమాదాలకు సంబంధించి రోజూ ఇలాంటి వార్తలు నిత్యకృత్యంగా మారాయి. దీంతో గ్యాస్ గీజర్లు ఎంత భద్రం అనే ప్రశ్న వస్తున్నది. ఈ నేపథ్యంలో గ్యాస్ గీజర్ వాడకంపై నిపుణులు కొన్ని సలహాలు, సూచనలు చేస్తున్నారు.
ఎందుకు వాడుతున్నారు?
నీటిని వేడి చేయడానికి సాధారణంగా ఎలక్ట్రిక్ గీజర్లు, వాటర్ హీటర్లను వాడుతారు. అయితే, కరెంటు బిల్లుతో పోల్చి చూస్తే.. గ్యాస్ వాడకం కాస్త చవక అనే ఉద్దేశంతో బడ్జెట్ దృష్ట్యా గ్యాస్ గీజర్లను వాడటం పెరిగింది. అయితే ఎలక్ట్రిక్ గీజర్లతో పోల్చితే గ్యాస్ గీజర్లతో ప్రమాదాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.
ఎందుకు ప్రమాదాలు?
- గ్యాస్ గీజర్లను సాధారణంగా చిన్నగా ఉన్న బాత్రూమ్లలో ఇన్స్టాల్ చేయిస్తున్నారు. ఇక్కడే అసలు సమస్య మొదలవుతున్నది. చిన్న గదుల్లో గ్యాస్ గీజర్లను ఇన్స్టాల్ చేయడంతో వెంటిలేషన్ ఉండట్లేదు.
- వేడి నీటి కోసం గ్యాస్‌ను ఆన్ చేయగానే ఆ మంట.. గదిలో ఉన్న ఆ కాస్త ఆక్సిజన్‌ను పీల్చేసుకొంటుంది. అలాగే, గ్యాస్ మండి కార్బన్ మోనాక్సైడ్ విషవాయువు బయటకు విడుదల అవుతున్నది. వేడెక్కిన నీళ్లు కూడా ఆక్సిజన్ స్థాయిలు తగ్గడానికి మరో కారణంగా మారుతున్నాయి.
- కార్బన్ మోనాక్సైడ్ విషవాయువుకు వాసన ఉండదు. దీంతో తెలియకుండానే దాన్ని పీల్చి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతున్నారు. దీన్నే గ్యాస్ గీజర్ సిండ్రోమ్‌గా పిలుస్తారు. పరిస్థితి చేజారితే మరణం సంభవించే ప్రమాదమూ ఉన్నది.
నిపుణుల సూచనలు ఇవి..
- బాత్రూమ్ చిన్నగా ఉండి వెంటిలేషన్ సరిగ్గా లేకపోతే గ్యాస్ గీజర్‌ను ఇన్స్టాల్ చేసుకోకపోవడమే మంచిది.
- ఒకవేళ చేసుకోవాల్సి వస్తే, గ్యాస్ సిలిండర్, గీజర్ మిషన్‌ను బయట ఇన్స్టాల్ చేయించి.. వేడి నీరు వచ్చే పైపును బాత్రూమ్ లోపలికి వచ్చేలా కనెక్షన్ ఇవ్వాలి.
- గీజర్‌కు గ్యాస్ సిలిండర్‌ను అనుసంధానించేప్పుడు సిలిండర్‌ను నిటారుగా, సురక్షిత ప్రదేశంలో ఉంచాలి. రాత్రంతా లేదా ఎక్కువ సేపు ఆన్ చేసి ఉంచొద్దు.
- ఐఎస్ఐ మార్క్ ఉన్న గ్యాస్ గీజర్లనే కొనుగోలు చేయాలి. ఆర్నెల్లకోసారి గ్యాస్ పైపులు, కనెక్షన్లు, బర్నర్‌ను లైసెన్స్డ్ టెక్నీషియన్‌తో చెక్ చేయించాలి.
- ఇంట్లో కార్బన్ మోనాక్సైడ్ డిటెక్టర్‌ను ఇన్స్టాల్ చేయిస్తే.. విషవాయువు వెలువడినప్పుడు అలారం ద్వారా హెచ్చరికలు వస్తాయి.
- గ్యాస్ వాసన వచ్చినా, తల తిరగడం, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

