Top 10 News | ఈరోజు టాప్ 10 న్యూస్..
Top 10 News | బుల్లెట్లను తలపించే అతడి బౌలింగ్‌లో వికెట్ కాపాడుకోవడం ఎంతటి బ్యాటర్‌కైనా శక్తికిమించిన పనే. ప్రపంచంలోనే మేటి బౌలర్‌గా కితాబులందుకున్న బుమ్రా ఒకానొకదశలో దేశం విడిచి వెళ్లాలనుకున్నాడట.
సీబీఐ కస్టడీలోకి కవిత.. ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది
ఎమ్మెల్సీ కవితను సీబీఐ అదుపులోకి తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ ఆమె తరఫున న్యాయవాది సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కవిత సీబీఐ అరెస్టుపై అత్యవసర విచారణ జరపాలని కవిత తరఫున న్యాయవాది మోహిత్‌రావు కోర్టును కోరారు. అయితే, ప్రత్యేక జడ్జి మనోజ్‌కుమార్ బెంచ్ ముందు దరఖాస్తు పిటిషన్ దాఖలు చేశారు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి..
హైదరాబాద్‌లో చల్లబడిన వాతావరణం.. ఈ జిల్లాల్లో నాలుగు రోజులు వర్షాలు..!
రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానలు పడే అవకాశాలున్నాయని పేర్కొంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. ఈ మేరకు నాలుగు రోజుల పాటు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి..
సీఎం రేవంత్‌రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
సీఎం రేవంత్‌రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలపై చేశారు. రేవంత్ మార్క్ పాలపై హాట్ కామెంట్స్ చేశారు. రేవంతు అంటే నా వంతు ఏంది అంటున్నడని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకి పోయిన వాళ్లు నీ వంతుకు రేటెంత రెడ్డి అని అడుగుతున్నారు. రేటెంత రెడ్డి రేట్ ఎవరు ఫిక్స్ చేస్తున్నారో తెలీదు.కానీ, ఎక్కడ పడితే అక్కడ ఈ రాష్ట్రంలో సెటిల్మెంట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.
కాంగ్రెస్ అడుగుపెట్టింది.. మళ్లీ కరువొచ్చింది : హరీశ్‌రావు
రాష్ట్రంలో కాంగ్రెస్ అడుగుపెట్టడంతోనే మళ్లీ కరువు వచ్చిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంటరీ సమావేశంలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందని.. కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయామని ప్రజలు అనుకుంటున్నారన్నారు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి..
రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం..
‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు టాలీవుడ్ అగ్ర హీరో రామ్‌చరణ్ . ఈ గ్లోబల్ స్టార్‌కు తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది. చెన్నై కి చెందిన వేల్స్ యూనివర్సిటీ చరణ్‌కు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి..
దేశం విడిచి వెళ్లాలనుకున్నా.. ప్రముఖ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా సంచలన వ్యాఖ్యలు
భారత జట్టు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా యార్కర్లకు పెట్టింది పేరు. నిరుడు గాయం నుంచి కోలుకున్న బుమ్రా.. టీమిండియా విజయాల్లో కీలకంగా మారాడు. వన్డే వరల్డ్ కప్ లో ఆ తర్వాత ఇంగ్లండ్ సిరీస్‌లో తన పేస్ పవర్ చూపించాడు. బుల్లెట్లను తలపించే అతడి బౌలింగ్‌లో వికెట్ కాపాడుకోవడం ఎంతటి బ్యాటర్‌కైనా శక్తికిమించిన పనే. ప్రపంచంలోనే మేటి బౌలర్‌గా కితాబులందుకున్న బుమ్రా ఒకానొకదశలో దేశం విడిచి వెళ్లాలనుకున్నాడట. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి..
అధికారంలోకి వస్తే మోదీని జైల్లో పెడతాం.. లాలూ కుమార్తె వివాదస్పద వ్యాఖ్యలు
బీహార్‌కు చెందిన ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఎలక్ట్రోలర్ బాండ్లు పెద్ద కుంభకోణమని ఇటీవల ఆరోపించారు. ‘ఇండియా’ బ్లాక్ కూటమి అధికారంలోకి వస్తే ఈ అవినీతికి పాల్పడిన ప్రధాని మోదీ, బీజేపీ నేతలు జైలుకు వెళ్తారని అన్నారు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి..
కేజ్రీవాల్‌కు మరో ఎదురుదెబ్బ.. పర్సనల్ సెక్రటరీపై వేటు
మద్యం కుంభకోణం కేసులో అరెస్టై జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కేజ్రీ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌పై వేటు పడింది. అతని నియామక ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ విజిలెన్స్ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి..
రైతులకు చల్లని కబురు చెప్పిన వాతావరణ శాఖ.. !
భారత వాతావరణ శాఖ తీపికబురు చెప్పింది. రాబోయే వానాకాలం సీజన్లో వర్షాలు సంవృద్ధిగా కురుస్తాయని వెల్లడించింది. ఎల్‌నినో పరిస్థితులు పూర్తిగా తొలగిపోయి.. లా నినా పరిస్థితులు కనిపిస్తున్నాయని.. హిందూ మహాసముద్ర ద్విధ్రువ పరిస్థితులతోపాటు లానినా పరిస్థితులు ఏకకాలంలో యాక్టివ్ మారుతుండడంతో రుతుపవనాలు ముందుగానే వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేసింది. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి..
సోదరుడి చేతిలో రూ.4.3 కోట్ల మేర మోసపోయిన పాండ్యా బ్రదర్స్
టీమ్ఇండియా స్టార్ క్రికెటర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సోదరుడు వైభవ్ పాండ్యా అరెస్ట్ అయ్యాడు. పాండ్యా సోదరులు కృనాల్, హార్దిక్ పాండ్యాలను మోసం చేసిన కారణంగా ముంబై పోలీసులు వైభవ్‌ను అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

