Arvind Kejriwal | కేజ్రీవాల్‌కు మరో ఎదురుదెబ్బ.. పర్సనల్ సెక్రటరీపై వేటు
Arvind Kejriwal | మద్యం కుంభకోణం కేసులో అరెస్టై జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) వ్యక్తిగత కార్యదర్శి (Private Secretary) బిభవ్ కుమార్ (Bibhav Kumar)పై వేటు పడింది.
Arvind Kejriwal | మద్యం కుంభకోణం కేసులో అరెస్టై జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కేజ్రీ వ్యక్తిగత కార్యదర్శి (Private Secretary) బిభవ్ కుమార్ (Bibhav Kumar)పై వేటు పడింది. అతని నియామక ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ విజిలెన్స్ (Directorate of Vigilance) వెల్లడించింది. ఈ మేరకు బిభవ్‌ను విధుల నుంచి తొలగించింది. ఈ తొలగింపు తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు విజిలెన్స్ స్పెషల్ సెక్రటరీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
విధుల్లో ఉన్న ఓ ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేశాడని బిభవ్‌పై 2007లో నోయిడా పోలీసులు కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ అధికారులు తమ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అతడు కేజ్రీవాల్‌కు పర్సనల్ సెక్రటరీగా నియమించే సమయంలో ఈ కేసు వివరాలను వెల్లడించలేదని విజిలెన్స్ విభాగం దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపింది. ఈ నియామకంలో అవకతవకలు జరిగాయని గుర్తించినట్లు పేర్కొంది. పాలనావ్యవహారాల పరంగా ఇది ఇబ్బందికర పరిణామం అని, ఎలాంటి ముందస్తు వెరిఫికేషన్ లేకుండా మంత్రుల వ్యక్తిగత సిబ్బందిని నియమించడం సరికాదని విజిలెన్స్ విభాగం తెలిపింది. బిభవ్‌పై నమోదైన అభియోగాలు తీవ్రమైనవని, వాటిపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించింది.
ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిభవ్ కుమార్‌ను ఈడీ అధికారులు సోమవారం విచారించిన విషయం తెలిసిందే. మనీలాండరింగ్ యాక్ట్ కింద అతడి స్టేట్మెంట్ను ఈడీ రికార్డు చేసింది. ఈడీ విచారణ అయిన మూడు రోజులకే బిభవ్‌ను విధుల నుంచి తొలగించడం గమనార్హం.
బిభవ్‌పై వేటు వేడయంపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) స్పందించింది. ఈ మేరకు బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. తమ పార్టీని అన్ని విధాలా దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించింది. తొలుత తప్పుడు కేసులో సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి సహా ఆయన సిబ్బంది మొత్తాన్ని తొలగించే పనిలో పడ్డారని మండిపడింది.
Also Read..
Rohit Sharma | రోహిత్ శర్మను తన కారులో రైడ్‌కు తీసుకెళ్లిన ముంబై జట్టు యజమాని ఆకాశ్ అంబానీ.. VIDEO
McKinsey | ఉద్యోగులకు షాకిచ్చిన మెకిన్సీ.. 360 మందిపై వేటు..!
Biryani | రంజాన్ మాసంలో బిర్యానీని తెగ లాగించేసిన హైదరాబాదీలు.. ఎన్ని లక్షల ప్లేట్లు తిన్నారంటే..?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

