McKinsey | ఉద్యోగులకు షాకిచ్చిన మెకిన్సీ.. 360 మందిపై వేటు..!
McKinsey | గ్లోబల్ కన్సల్టింగ్ దిగ్గజం మెకిన్సీ (McKinsey layoffs) తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. సంస్థలో పనిచేస్తున్న వారిలో 3 శాతం మందిని తొలగించేందుకు సిద్ధమైంది.
McKinsey | ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతుండటంతో టెక్ దిగ్గజాలతో పాటు పలు కంపెనీలు పెద్దసంఖ్యలో ఉద్యోగులపై (Employees) వేటు వేస్తున్నాయి. మాస్ లేఆఫ్స్ ట్రెండ్‌ను కొనసాగిస్తూ టెకీల్లో గుబులు రేపుతున్నాయి. తాజాగా గ్లోబల్ కన్సల్టింగ్ దిగ్గజం మెకిన్సీ (McKinsey layoffs) తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. సంస్థలో పనిచేస్తున్న వారిలో 3 శాతం మందిని తొలగించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ (Bloomberg) నివేదించింది.
తన సేవలకు డిమాండ్ క్షీణించిన కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 360 మంది ఉద్యోగులను తొలగించడానికి మెకిన్సీ సిద్ధమైనట్లు బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. డిజైన్, డేటా ఇంజినీరింగ్, క్లౌడ్, సాఫ్ట్వేర్ సహా పలు విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 12,000 మంది సిబ్బందిపై ఈ లేఆఫ్స్ ప్రభావం ఉండనున్నట్లు పేర్కొంది. తొలగింపులతోపాటు పలువురు ఉద్యోగుల పనితీరుపై కూడా హెచ్చరించినట్లు తెలిపింది. సుమారు 3,000 మంది ఉద్యోగులను పనితీరులో మెరుగుదల అవసరం గురించి హెచ్చరించినట్లు బ్లూమ్‌బర్గ్ నివేదించింది.
వందేండ్ల కిందట అంటే 1926లో చికాగోలో ఏర్పాటైన మెకిన్సీ ప్రస్తుతం 130 దేశాల్లో తన సేవలను విస్తరించింది. మెకిన్సీలో ప్రపంచవ్యాప్తంగా 45,000 మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2021లో కంపెనీ 15 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇక సంస్థ వెబ్సైట్ప్రకారం, తన ఖాతాదారులకు మెరుగైన సేవలందించేందుకు మెకిన్సీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించాలని చూస్తోంది.
Also Read..
Rohit Sharma | రోహిత్ శర్మను తన కారులో రైడ్‌కు తీసుకెళ్లిన ముంబై జట్టు యజమాని ఆకాశ్ అంబానీ.. VIDEO
Hardik Pandya | సోదరుడి చేతిలో రూ.4.3 కోట్ల మేర మోసపోయిన పాండ్యా బ్రదర్స్
Biryani | రంజాన్ మాసంలో బిర్యానీని తెగ లాగించేసిన హైదరాబాదీలు.. ఎన్ని లక్షల ప్లేట్లు తిన్నారంటే..?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
రకుల్ ప్రీత్ అందాల విందు.. బ్లూ శారీలో స్టన్నింగ్ లుక్‌తో కట్టిపడేస్తోందిగా!
Collector Pratima Singh | పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత : కలెక్టర్ ప్రతిమా సింగ్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

