Biryani | రంజాన్ మాసంలో బిర్యానీని తెగ లాగించేసిన హైదరాబాదీలు.. ఎన్ని లక్షల ప్లేట్లు తిన్నారంటే..?
Biryani | బిర్యానీ (Biryani) అంటే ఇష్టపడని వారెవరైనా ఉంటారా..? చెప్పండి. ఆ వాసనకే కడుపు నిండిపోతోంది. అంతటి రుచికరమైన బిర్యానీని రంజాన్ మాసం (Ramadan Month) సందర్భంగా హైదరాబాదీలు తెగ లాగించేశారట.
Biryani | బిర్యానీ (Biryani) అంటే ఇష్టపడని వారెవరైనా ఉంటారా..? చెప్పండి. ఆ వాసనకే కడుపు నిండిపోతోంది. ఇక మన హైదరాబాద్ బిర్యానీ (Hyderaba Biryani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశం మొంత్తంగా హైదరాబాద్ బిర్యానీ టాప్‌లో ఉంటుంది. విదేశీయులు కూడా ఈ బిర్యానీని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇతర రాష్ట్రాల ప్రజలు నగరానికి వస్తే కచ్చితంగా బిర్యానీ తినకుండా వెనుతిరిగి వెళ్లరు. అంతటి రుచికరమైన బిర్యానీని రంజాన్ మాసం (Ramadan Month) సందర్భంగా నగరవాసులు తెగ లాగించేశారట. ఈ రంజాన్ నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా పది లక్షల పేట్ల బిర్యానీ ఆర్డర్లు (A Million Plates Of Biryani) వచ్చినట్లు ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తాజాగా వెల్లడించింది.
ఈ ఏడాది రంజాన్ మాసం మార్చి 11న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇవాళ్టితో ముగిసింది. దీంతో మార్చి 11 నుంచి ఏప్రిల్ 8 వరకూ దేశవ్యాప్తంగా ఫుడ్ డెలివరీ ఆర్డర్ల గురించి వివరాలను స్విగ్గీ తాజాగా వెల్లడించింది. ఈ నెల రోజుల్లో దేశవ్యాప్తంగా ఏకంగా 60 లక్షల పేట్ల బిర్యానీ ఆర్డర్లు డెలివరీ చేసినట్లు స్విగ్గీ తెలిపింది. సాధారణ రోజుల కంటే ఇవి 15 శాతం ఎక్కువ అని పేర్కొంది.
ఇక దేశవ్యాప్తంగా బిర్యానీ ఆర్డర్లలో హైదరాబాద్ టాప్‌లో ఉన్నట్లు స్విగ్గీ వెల్లడించింది. నెల రోజుల్లోనే 10 లక్షల పేట్ల బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు తెలిపింది. బిర్యానీతోపాటు హలీమ్ ఆర్డర్లలోనూ నగరవాసులు రికార్డు సృష్టించినట్లు తెలిపింది. ఈ నెలలో ఏకంగా 5.3 లక్షల హలీమ్ ఆర్డర్లు వచ్చినట్లు పేర్కొంది. రంజాన్ మాసం సందర్భంగా సాయంత్రం 5.30 గంటల నుంచి 7 గంటల వరకు ఇఫ్తార్ ఆర్డర్లు 34 శాతం పెరిగాయని తెలిపింది.
ఆర్డర్లలో ఎక్కువగా చికెన్, మటన్ బిర్యానీ, హలీమ్, సమోసా, ఫలుదా, ఖీర్ ఉన్నాయని స్విగ్గీ తెలిపింది. మొత్తంగా హలీమ్ ఆర్డర్లు 1454.88 శాతం, ఫిర్ని 80.97 శాతం పెరిగినట్లు తెలిపింది. మాల్పువా ఆర్డర్లు 79.09 శాతం, ఫలుదా 57,93 శాతం, డేట్స్ 48.40 శాతం ఆర్డర్లు పెరిగినట్లు తెలిపింది. ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, భోపాల్, మీరట్‌లో ఇఫ్తార్ స్వీట్ డిష్‌ల ఆర్డర్లు గణనీయంగా పెరిగినట్లు స్విగ్గీ వెల్లడించింది.
Also Read..
Israel | హమాస్‌తో యుద్ధంతో కార్మికుల కొరత.. ఇజ్రాయెల్‌కు వెళ్లనున్న 6 వేల మంది భారత శ్రామికులు
School Bus | చెట్టును ఢీ కొట్టి బోల్తాపడిన పాఠశాల బస్సు.. ఆరుగురు విద్యార్థులు మృతి
Kashi Vishwanath Temple | కాశీ విశ్వనాథుడి ఆలయంలో పోలీసులకు సంప్రదాయ యూనిఫాం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

