School Bus | చెట్టును ఢీ కొట్టి బోల్తాపడిన పాఠశాల బస్సు.. ఆరుగురు విద్యార్థులు మృతి
School Bus | హర్యానా (Haryana) రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పాఠశాల బస్సు (School Bus) ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
School Bus | హర్యానా (Haryana) రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పాఠశాల బస్సు (School Bus) ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళితే.. ఇవాళ ఈద్-ఉన్-ఫితర్ సెలవు ఉన్నప్పటికీ స్థానికంగా ఉన్న జీఎల్ పబ్లిక్ స్కూల్ (GL Public School)ను అధికారులు తెరిచారు. దీంతో పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులను ఎక్కించుకుని వస్తోంది. ఈ క్రమంలో నార్నౌల్ సమీపంలోని ఉన్హాని గ్రామ సమీపంలో బోల్తాపడింది. అనంతరం పల్టీలు కొట్టడంతో బస్సులోని ఆరుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు పది పందికిపైగా విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మందిదాకా చిన్నారులు ఉన్నట్లు సమాచారం.
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన చిన్నారులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ మద్యం మత్తులో బస్సు నడిపి చెట్టుకు ఢీ కొట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని జిల్లా విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు. ఆరేళ్ల క్రితం 2018లోనే బస్సు ఫిట్నెస్ సర్టిఫికెట్ గడువు ముగిసినట్లు అధికారిక పత్రాల ద్వారా తెలిసిందని వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
#WATCH | Five students dead, 15 injured after a private school bus meets with an accident in Mahendragarh's Kanina, in Haryana. pic.twitter.com/jhRvJo0hXg
— ANI (@ANI) April 11, 2024
Also Read..
Kashi Vishwanath Temple | కాశీ విశ్వనాథుడి ఆలయంలో పోలీసులకు సంప్రదాయ యూనిఫాం
Ramadan | దేశవ్యాప్తంగా రంజాన్ ప్రార్థనలు.. ఈద్గాల వద్ద సందడి
PM Modi: ఇండో-చైనా బోర్డర్ సమస్యను సత్వరమే పరిష్కరించాలి: ప్రధాని మోదీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

