Israel | హమాస్‌తో యుద్ధంతో కార్మికుల కొరత.. ఇజ్రాయెల్‌కు వెళ్లనున్న 6 వేల మంది భారత శ్రామికులు
Israel | హమాస్‌తో ఘర్షణల వల్ల ఇజ్రాయెల్ నిర్మాణ రంగం కుదేలైంది. ప్రస్తుతం ఈ రంగంలో కార్మికుల కొరత తీవ్రమైంది (labour shortage). దీంతో భారత్ నుంచి 6,000 మంది శ్రామికులు అక్కడికి వెళ్లనున్నారు (Indian Construction Workers).
Israel | ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం (Israel – Hamas War) ఆరునెలలుగా కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ఇరువైపులా భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. యుద్ధం కారణంగా గాజా స్ట్రిప్ అతలాకుతలమవుతోంది. అనేక మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఉండేందుకు ఇల్లు, తినేందుకు ఆహారం, తాగేందుకు నీరు లేక అల్లాడిపోతున్నారు. ఇక హమాస్‌తో ఘర్షణల వల్ల ఇజ్రాయెల్ నిర్మాణ రంగం కుదేలైంది. ప్రస్తుతం ఈ రంగంలో కార్మికుల కొరత తీవ్రమైంది (labour shortage). యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇజ్రాయెల్‌లో అనేక ప్రాజెక్టులు నిలిచిపోయాయి.
ఇప్పటి వరకూ పాలస్తీనా ఆధీనంలోని వెస్ట్ బ్యాంక్ నుంచి 80 వేల మంది, గాజాకు చెందిన 17 వేల మంది అక్కడ పనిచేస్తుండేవారు. కానీ , తాజా ఘర్షణల నేపథ్యంలో వారికి పని అనుమతిని ఇజ్రాయెల్ రద్దు చేసింది. దీంతో కార్మికుల కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే వారి స్థానాల్లో ఇజ్రాయెల్ విదేశాల నుంచి కార్మికులను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా భారత్ నుంచి 6,000 మంది శ్రామికులు అక్కడికి వెళ్లనున్నారు (Indian Construction Workers). ఏప్రిల్, మే నెలల్లో ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి వీరందరినీ తరలించనున్నారు. ప్రయాణ ఖర్చుల్లో రాయితీ ఇవ్వాలని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం, ఆర్థిక శాఖ, నిర్మాణ శాఖ సంయుక్తంగా నిర్ణయించాయి. ఈ మేరకు బుధవారం రాత్రి ఇజ్రాయెల్ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.
Also Read..
Kashi Vishwanath Temple | కాశీ విశ్వనాథుడి ఆలయంలో పోలీసులకు సంప్రదాయ యూనిఫాం
School Bus | చెట్టును ఢీ కొట్టి బోల్తాపడిన పాఠశాల బస్సు.. ఆరుగురు విద్యార్థులు మృతి
Ramadan | దేశవ్యాప్తంగా రంజాన్ ప్రార్థనలు.. ఈద్గాల వద్ద సందడి
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs West Indies | హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
Horoscope | 15-10-2026 గురువారం.. మీ రాశి ఫలాలు
KTR | కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
Palamuru-Rangareddy Project | మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

