Ram Charan | రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. గౌరవ డాక్టరేట్ ప్రకటించిన వేల్స్ యూనివర్సిటీ
Ram Charan | టాలీవుడ్ అగ్ర హీరో రామ్‌చరణ్ (Ram Charan)కు మరో అరుదైన గౌరవం దక్కింది. చెన్నై (Chennai)కి చెందిన వేల్స్ యూనివర్సిటీ (Vels University) చరణ్‌కు గౌరవ డాక్టరేట్ (doctorate) ప్రకటించింది.
Ram Charan | ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు టాలీవుడ్ అగ్ర హీరో రామ్‌చరణ్ (Ram Charan). ఈ గ్లోబల్ స్టార్‌కు తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది. చెన్నై (Chennai)కి చెందిన వేల్స్ యూనివర్సిటీ (Vels University) చరణ్‌కు గౌరవ డాక్టరేట్ (doctorate) ప్రకటించింది.
ఈ నెల 13న జరగనున్న విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ వేడుకల్లో చరణ్ ముఖ్య అతిథిగా పాల్గొని గౌరవ డాక్టరేట్‌ను అందుకోనున్నారు. కళా రంగంలో రామ్ చరణ్ అందించిన సేవలకు గానూ డాక్టరేట్ అందిస్తున్నట్లు తెలిసింది. ఈ వేడుకకు చరణ్ తోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. ఇక రామ్ చరణ్‌కు ఈ అరుదైన గౌరవం దక్కడంపై మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మెగా పవర్ స్టార్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Global Star @AlwaysRamCharan will be honored with a doctorate at Vels University, Chennai on April 13th. 👏👏#RamCharan pic.twitter.com/53qLNBAO8U
— Thyview (@Thyview) April 11, 2024
ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రామ్‌చరణ్ గేమ్‌ఛేంజర్ (Game changer)లో నటిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రంలో రాజోలు భామ అంజలి, బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్, ఎస్జే సూర్య, నవీన్ చంద్ర, శ్రీకాంత్, సముద్రఖని, జయరాయ్, సునీల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. గేమ్ ఛేంజర్‌కు పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.
మరోవైపు ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో కూడా చరణ్ నటిస్తున్నారు. ఆర్సీ 16 వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం ఇటీవలే హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభించారు. ఈ చిత్రంలో జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ (Shiva Rajkumar) కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ బ్యాగ్‌డ్రాప్‌తో వస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు విజేత ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించనుండగా.. మైత్రీమూవీ మేకర్స్ సమర్పిస్తున్నది. వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలపై వెంకటసతీశ్ కిలారు అత్యంత భారీ వ్యయంతో ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.
Also Read..
Arvind Kejriwal | కేజ్రీవాల్‌కు మరో ఎదురుదెబ్బ.. పర్సనల్ సెక్రటరీపై వేటు
Rohit Sharma | రోహిత్ శర్మను తన కారులో రైడ్‌కు తీసుకెళ్లిన ముంబై జట్టు యజమాని ఆకాశ్ అంబానీ.. VIDEO
Biryani | రంజాన్ మాసంలో బిర్యానీని తెగ లాగించేసిన హైదరాబాదీలు.. ఎన్ని లక్షల ప్లేట్లు తిన్నారంటే..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

