Harish Rao | కాంగ్రెస్ అడుగుపెట్టింది.. మళ్లీ కరువొచ్చింది : హరీశ్‌రావు
Harish Rao | రాష్ట్రంలో కాంగ్రెస్ అడుగుపెట్టడంతోనే మళ్లీ కరువు వచ్చిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంటరీ సమావేశంలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందని.. కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయామని ప్రజలు అనుకుంటున్నారన్నారు.
Harish Rao | రాష్ట్రంలో కాంగ్రెస్ అడుగుపెట్టడంతోనే మళ్లీ కరువు వచ్చిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంటరీ సమావేశంలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందని.. కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయామని ప్రజలు అనుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో చిన్నకోడూరులో ఆరుగంటలే కరెంట్ వచ్చేదని.. రూ.90వేలకోట్ల ఖర్చుతో కేసీఆర్ కరెంట్‌ని బాగు చేశారన్నారు. చిన్నకోడూరు మండలంలోనే 12 సబ్స్టేషన్లు పెట్టామని.. కేసీఆర్ 24గంటలు కోతల్లేని కరెంటు ఇచ్చారన్నారు. చిన్నకోడూరు నెత్తిమీద రంగ నాయక సాగర్‌ను పెట్టామన్నారు. 90 ఏండ్లు ఎండిన చిన్నకోడూరు పెద్ద చెరువును నింపామని చెప్పారు.
ఎర్రటి ఎండల్లో కూడా చెరువులు మత్తడి దుంకినయని చెప్పారు. చిన్నకోడూరులో రెండు పంటలు పండించుకున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో గడ్డి కేంద్రాలు పెట్టి పశువులను కాపాడుకున్నామన్నారు. కేసీఆర్ పాలనలోనే పదేళ్లు కరువే లేదని.. కాంగ్రెస్ అడుగుపెట్టింది.. మళ్లీ కరువొచ్చిందన్నారు. మళ్లీ బోర్లలో పూడిక తీసుడు.. కరెంటు మోటర్లు కాలుడు మొదలైందని.. రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయన్నారు. ఓడ దాటినంక బోడమల్లన్న అని కాంగ్రెస్ అంటోందని.. ఆరు గ్యారంటీలని నమ్మకలికి కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ఈసారి తప్పితే కాంగ్రెస్ వాళ్లు ఐదేళ్లు దొరుకరని.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్లకు చురక పెడితేనే దారికొస్తరన్నారు.
రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. రూ.2లక్షల రుణమాఫీ కానివాళ్లు బీఆర్ఎస్ ఓటేయాలని కోరారు. వరిధాన్యం క్వింటాల్‌కు రూ.2500 ధరతో కొంటామన్నారని.. క్వింటాల్‌కు రూ.2500 ధరతో వరి ధాన్యం కొనాలని నిలదీయాలన్నారు. ఆసరా ఫించన్ రూ.4వేలు ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని.. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్‌కు అవ్వాతాతలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. జనవరిలో ఇవ్వాల్సిన రూ.2వేల పెన్షన్ కూడా రేవంత్‌రెడ్డి ఎగ్గొట్టారని.. అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడినట్లయ్యిందన్నారు.
రూ.200 ఉన్న పింఛన్ కేసీఆర్ రూ.2వేలకు పెంచారని.. కాంగ్రెస్ వాళ్లు ప్రతినెలా ఆడబిడ్డల ఖాతాల్లో రూ.2500 వేస్తానన్నారని.. ఇప్పటి వరకు పైసా ఇవ్వలేదని గుర్తు చేశారు. ప్రతి ఆడబిడ్డకు కాంగ్రెస్ నాలుగు నెలల్లో రూ.10వేలు బాకీ పడ్డదని.. రూ.10వేలు ఇచ్చినంకనే ఓటడగాలని కాంగ్రెస్‌ను నిలదీయాలన్నారు. కల్యాణలక్ష్మి లక్షకు తోడు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని.. కొత్త పథకాల సంగతి తర్వాత ఉన్నవి కూడా రావడం లేదన్నారు. రైతుబంధు ఇప్పటికీ పూర్తి కాలేదని.. నిరుద్యోగులకు నెలకు రూ.4వేలు ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటేసి గెలిపించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

