IMD | చల్లని కబురు చెప్పిన వాతావరణ శాఖ.. ముందుగానే రుతుపవనాలు..!
IMD | భారత వాతావరణ శాఖ (IMD) తీపికబురు చెప్పింది. రాబోయే వానాకాలం సీజన్లో వర్షాలు సంవృద్ధిగా కురుస్తాయని వెల్లడించింది. ఎల్నినో పరిస్థితులు పూర్తిగా తొలగిపోయి.. లా నినా పరిస్థితులు కనిపిస్తున్నాయని పేర్కొంది.
IMD | భారత వాతావరణ శాఖ (IMD) తీపికబురు చెప్పింది. రాబోయే వానాకాలం సీజన్లో వర్షాలు సంవృద్ధిగా కురుస్తాయని వెల్లడించింది. ఎల్నినో పరిస్థితులు పూర్తిగా తొలగిపోయి.. లా నినా పరిస్థితులు కనిపిస్తున్నాయని.. హిందూ మహాసముద్ర ద్విధ్రువ (IDO) పరిస్థితులతోపాటు లానినా పరిస్థితులు ఏకకాలంలో యాక్టివ్ మారుతుండడంతో రుతుపవనాలు ముందుగానే వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతున్నాయి.
ఇప్పటికే పలుచోట్ల కర్ణాటకతో పాటు పలు రాష్ట్రాల్లో మంచినీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో రాబోయే వర్షాకాలం సీజన్లోనైనా వర్షాలు కురుస్తాయనే ఆశలున్నాయి. రుతుపవనాల అల్పపీడనాలు పశ్చిమ, వాయవ్య భారతదేశం, ఉత్తర అరేబియా సముద్రంవైపు విస్తరించి స్థిరమైన పంథాను అనుసరిస్తాయని ఐఎండీ భావిస్తున్నది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో వర్షపాతం పెరుగుతుందని.. సాధారణ వర్షపాతానికి మించి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నది.
లా నినా.. ఎల్ నినో అంటే..?
అయితే, లా నినాతో పసిఫిక్ మహాసముద్రంపై భూమధ్యరేఖ వెంట వీచే గాలులు.. అంటే తూర్పున దక్షిణ అమెరికా నుంచి పశ్చిమాన ఆసియా వైపు వీచే గాలులు సాధారణం కంటే బలంగా ఉంటాయి. ఈ గాలులు దక్షిణ అమెరికా నుంచి ఆసియా వైపుకు వెచ్చటి నీటిని తీసుకొస్తాయి. దాంతో సముద్రమట్టాలు పెరుగుతాయి. అమెరికా వైపు చల్లటి నీరు ఉపరితలంపైకి వస్తుంది. ఎల్ నినో దశలో పూర్తిగా దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది. వెచ్చటి నీరు అమెరికా వైపుకు చేరుతుంది. ఆసియా వైపు చల్లటి నీరు సముద్ర ఉపరితలం మీదకు వస్తుంది. ఎల్ నినో.. లా నినో దశలు ఒకేలా ఉండవు.
వాటిలో కొన్ని కామన్గా ఉంటాయి. ఎల్ నినో దశలో వెచ్చటి నీరు మరింతగా వ్యాపిస్తుంది. ఉపరితలానికి దగ్గరగా ఉంటుంది. ఇది వాతావరణంలోకి మరింత వేడిని విడుదల చేస్తుంది. దాంతో తేమ, వెచ్చని గాలులు పెరుగుతాయి. ఎల్ నినో సమయంలో సముద్రంలో వెచ్చటి నీరు తూర్పు వైపుకూ, దక్షిణం వైపుకూ ప్రవహిస్తుంది. దక్షిణ అమెరికా, గల్ఫ్ ఆఫ్ మెక్సికో ప్రాంతాలలో వర్షాలు పడతాయి. ఉత్తర అమెరికా, కెనడా ప్రాంతాలు పొడిగానే ఉంటాయి. ఆసియా, ఆస్ట్రేలియా, మధ్య, దక్షిణ ఆఫ్రికాలలో వర్షాలు లేక.. కరువు పరిస్థితులు ఏర్పడుతాయి. లా నినా ఉన్నప్పుడు దీని విరుద్ధంగా జరుగుతుంది. దక్షిణ అమెరికా, కెనడా, ఆసియాలలో భారీ వర్షాలు పడే అవకాశాలుంటాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveenkumar | అసెంబ్లీలో జరిగిన చర్చ అంతా ఏక్షపక్షం.. జీవో నంబర్ 134 రాజ్యాంగ వ్యతిరేకం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Parnasala Movie | ‘పర్ణశాల’ సినిమా నుంచి వైరల్ ‘జిమ్ జిమ్ తార’ ఫుల్ సాంగ్ రిలీజ్!
Comrade Kalyan | బాక్సాఫీస్ వద్ద శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ జోరు.. హిట్గా నిలిచిన కామెడీ డ్రామా!
Piyush Goyal | సీఈసీలకు పద్మ అవార్డుల్ని కాంగ్రెస్ లంచాలుగా ఇచ్చింది.. కేంద్ర మంత్రి పీయూష్ సంచలన ఆరోపణ
ఎంజీయూ పీజీ, ఎంబీఏ సెమిస్టర్ ఫలితాలు విడుదల
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

