Rahul Gandhi : లోక్‌సభ (Lok Sabha) లో ప్రధాన ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ (Congress Party) అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi).. ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని బీజేపీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న సర్కారు వైఫల్యం చెందిన సర్కారు అని మండిపడ్డారు. బీజేపీ సర్కారును గద్దె దించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని వ్యాఖ్యానించారు.
తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలిస్తామని రాహుల్‌గాంధీ చెప్పారు. ప్రజా సంక్షేమమే తమకు ముఖ్యమని, ప్రజల అభివృద్ధికి పాటుపడుతామని అన్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. పైగా ఈ ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలు, బ్యాంకులను ప్రైవేటైజ్ చేసిందని మండిపడ్డారు. కేంద్రం తీరుతో డిగ్రీకి విలువ లేకుండా పోయిందని రాహుల్‌గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగం సాధించి పెట్టలేనప్పుడు ఆ డిగ్రీ ఉండి ఏం లాభమని రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. దేశంలో యువతకు ఉద్యోగం రావాలన్న, పేద మధ్యతరగతి ప్రజలు అభివృద్ధి చెందాలన్నా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అన్నారు. ఇవాళ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో మాట్లాడారు.
Road accident | కుంభమేళాకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం
Delhi Assembly | ఈ నెల 25న ఢిల్లీ అసెంబ్లీ ముందుకు కాగ్ రిపోర్ట్.. ఆ రిపోర్టులో ఏముంది..?
Jagadish Reddy | ఏపీ నీటి దోపిడీతో.. తెలంగాణలో సాగు, తాగు నీళ్లకు కటకట: మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
Daaku Maharaaj OTT | ఓటీటీలోకి వచ్చేసిన ‘డాకు మహారాజ్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
Nandini Milk | వినియోగదారులకు షాక్.. పాల ధరల పెంపుకు కేఎమ్ఎఫ్ ప్రతిపాదన.. లీటరుపై ఎంతంటే..?