Daaku Maharaaj Netflix | అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj). ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించగా.. శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా నటించారు. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్‌ను అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. విద్యావేత్త, ఓ పెద్ద స్కూల్‌కి అధినేత అయిన కృష్ణమూర్తి(సచిన్ ఖేడ్కర్)కి ఓ కాఫీ ఎస్టేట్ ఉంటుంది. దాన్ని స్థానిక ఎమ్మెల్యే త్రిమూర్తులు(రవి కిషన్) లీజుకు తీసుకుంటాడు. అయితే.. అక్కడ తోటను పండించకుండా వన్యప్రాణులను చంపి వాటి శరీరాలతో వ్యాపారం చేస్తుంటాడు. ఈ విషయం తెలిసిన కృష్ణమూర్తి పోలీసులను ఆశ్రయిస్తాడు. త్రిమూర్తులుపై కేసు పెడతాడు. దాంతో కృష్ణమూర్తిపై పగబట్టిన త్రిమూర్తులు.. కృష్ణమూర్తి మనవరాలు వైష్ణవికి ప్రాణహాని తలపెడతాడు. కృష్ణమూర్తి ఇంట్లో పనిచేస్తున్న ఓ వ్యక్తి(మకరంద్ దేశ్‌పాండే) ఆ విషయాన్ని పసిగట్టి వెంటనే.. చంబల్‌లోని మోస్ట్ వాంటెడ్ ‘డాకు మహారాజ్'(బాలకృష్ణ)కు కబురు పంపుతాడు. నానాజీ పేరుతో డాకు మహారాజ్ ఆ ఇంట్లో డ్రైవర్‌గా చేరతాడు. అసలు ఈ ‘డాకు మహారాజ్’ ఎవరు? వైష్ణవి పాపకు డాకు మహారాజ్‌కు ఉన్న సంబంధం ఏంటి? ఈ కథతో బల్వంత్ ఠాకూర్(బాబీ డియోల్), నందిని(శ్రద్ధా శ్రీనాథ్)కి సంబంధ ఏంటి? అసలు ఆ ఇంట్లోకి నానాజీగా డాకు మహారాజ్ రావాల్సిన అవసరం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
Maharaj osthunnadu, siddham avvandi. Eevala oochakootha kaayam!
Watch Daaku Maharaaj, now on Netflix in Telugu, Tamil, Kannada, Malayalam & Hindi!#DaakuMaharaajOnNetflix pic.twitter.com/kjc5AR9XSS— Netflix India South (@Netflix_INSouth) February 21, 2025