Delhi Assembly : ఢిల్లీ (Delhi) పరిపాలనకు సంబంధించి కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) రూపొందించిన నివేదిక ఈ నెల 25న అసెంబ్లీ ముందుకు రానుంది. ఢిల్లీలో కొత్తగా కొలువుదీరిన బీజేపీ (BJP) సర్కారు ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఈ 25న రిపోర్టు అసెంబ్లీ ముందుకు రానుండగా.. 25, 27 తేదీల్లో ఆ నివేదికపై చర్చ జరగనుంది. ఈ విషయాన్ని ఢిల్లీ కాబోయే స్పీకర్‌గా ప్రచారం జరుగుతున్న విజేందర్ గుప్తా (Vijender Gupta) వెల్లడించారు.
కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఢిల్లీ అసెంబ్లీ తొలిసారి సమావేశం కాబోతున్నది. ఈ నెల 24న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమవుతాయి. 24, 25, 27 తేదీల్లో మొత్తం మూడు రోజులపాటు ఈ సమావేశాలు కొనసాగుతాయి. 24న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్.. ప్రొటెం స్పీకర్‌ను నియమిస్తారు. అనంతరం ప్రొటెం స్పీకర్ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అందరితో ప్రమాణస్వీకారాలు చేయిస్తారు. ఆ తర్వాత స్పీకర్‌ను, డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకుంటారు.
25న ప్రభుత్వం కాగ్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెడుతుంది. 25, 27 తేదీల్లో రెండు రోజులపాటు ఆ నివేదికపై చర్చ జరుగుతుంది. ప్రభుత్వ నిధులను పాలకులు దుర్వినియోగం చేశారని, ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయని కాగ్ తన నివేదికలో పేర్కొంది. ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని అసెంబ్లీ ఎన్నికలకు ముందే అప్పటి ప్రతిపక్షమైన బీజేపీ డిమాండ్ చేసింది. కానీ ఆప్ సర్కారు కోర్టుకు వెళ్లడంతో ఎన్నికలకు కేవలం 20 రోజులు మాత్రమే ఉన్నందున.. ఈ విషయంలో తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోమని కోర్టు స్పష్టం చేసింది.
Jagadish Reddy | ఏపీ నీటి దోపిడీతో.. తెలంగాణలో సాగు, తాగు నీళ్లకు కటకట: మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
Daaku Maharaaj OTT | ఓటీటీలోకి వచ్చేసిన ‘డాకు మహారాజ్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
Nandini Milk | వినియోగదారులకు షాక్.. పాల ధరల పెంపుకు కేఎమ్ఎఫ్ ప్రతిపాదన.. లీటరుపై ఎంతంటే..?