Nandini Milk | కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (Karnataka Milk Federation) రాష్ట్రవ్యాప్తంగా నందిని పాల (Nandini Milk) ధరలను పెంచేందుకు సిద్ధమైంది. లీటరుపై ఏకంగా రూ.5 పెంచేలా ప్రభుత్వానికి ప్రతిపాదన చేసినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనకు మార్చి 7న రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఆమోదం తెలిపితే.. ఆ తర్వాత నుంచే కొత్త ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ధరల పెంపుతో పాటు పాల పరిమాణం (cut in quantity) కూడా తగ్గించేలా ప్రతిపాదన చేసింది.
ఇప్పటి వరకూ ప్రతి పాల ప్యాకెట్లో 50 ml పాలను ఎక్కువగా అందిస్తున్న విషయం తెలిసిందే. అంటే లీటరు ప్యాకెట్ 1,000 mlకి బదులు 1,050 ml అందిస్తోంది. అయితే తాజా ప్రతిపాదన ప్రకారం.. ప్యాకెట్ పాలు 1,050 మిల్లీ లీటర్ల నుంచి లీటరకు (1,000 ml) తగ్గనుంది. ఈ ప్రతిపాదకు ప్రభుత్వం ఆమోదం తెలిపితే.. లీటరు నందిని టోన్డ్ మిల్క్ ధర రూ.47కు పెరగనుంది.
కాగా, నందిని పాల ధరలను కేఎమ్ఎఫ్ ఏటా పెంచుతూ వస్తున్న విషయం తెలిసిందే. చివరిసారిగా జూన్ 2024లో నందిని పాల ధరలను పెంచిన విషయం తెలిసిందే. అప్పుడు లీటరుపై రూ.2 పెంచింది. అంతకు ముందు జులై 2023లో నందిని పాల ధరలను లీటరుపై రూ.3 పెంచింది. ఇప్పుడే ఏకంగా రూ.5 పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం గమనార్హం.
ఇక కాఫీ బ్రూవర్ల సంఘం ఇటీవలే మార్చి నాటికి కాఫీ పౌడర్ ధరలను కిలోకు రూ.200 పెంచనున్నట్లు ప్రకటించింది. ఇక BMTC బస్సులు, నమ్మ మెట్రో టికెట్ ఛార్జీలు పెరిగాయి. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం నీటి సుంకాన్ని పెంచేందుకు పరిశీలన చేస్తోంది. ఇంతలో, విద్యుత్ సరఫరా కంపెనీలు (escoms) రాబోయే ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ సుంకాలను యూనిట్‌కు 67 పైసలు పెంచడానికి కర్ణాటక విద్యుత్ కమిషన్ నుండి అనుమతి కోరాయి. ఇలా.. నిత్యావసర వస్తువుల నుంచి నీరు, బస్సు ఛార్జీలు, విద్యుత్ ఛార్జీల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న క్రమంలో పాల ధరలు పెంపు మరింత భారం కానుంది.
Also Read..
Sourav Ganguly: మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కాన్వాయ్‌కు ప్రమాదం
Lady Don: లేడీ డాన్ జోయా ఖాన్ అరెస్టు.. కోటి విలువైన హెరాయిన్ పట్టివేత
Maha Kumbh | ఐదు రోజుల్లో ముగియనున్న మహాకుంభమేళా.. భక్తుల సంఖ్య 65 కోట్లు దాటే అవకాశం