Maha Kumbh | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj)లో జరుగుతున్న మహాకుంభమేళా (Maha Kumbh Mela)లో భక్తుల (Devotees) రద్దీ కొనసాగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం అయిన ఈ మహా కుంభమేళా చివరి దశకు చేరింది. మరో ఐదు రోజుల్లో మహాకుంభమేళా ముగియనుంది. ఈ క్రమంలో గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. గత ఆరు రోజులుగా రోజూ కోటి మందికిపైగా భక్తులు నదీ స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలో త్రివేణీ సంగమం (Triveni Sangam)లో పుణ్యస్నానాలు ఆచరించిన వారి సంఖ్య 58 కోట్లు దాటినట్లు అధికారులు తెలిపారు.
#WATCH | Uttar Pradesh: Devotees continue to arrive at Triveni Sangam in Prayagraj to be a part of #MahaKumbh2025. The Mela will go on till 26th February.
Drone visuals from the area. pic.twitter.com/hXtSfQUxwl
— ANI (@ANI) February 21, 2025
కాగా, పౌష్ పూర్ణిమ సందర్భంగా జనవరి 13వ తేదీన మహాకుంభమేళా ప్రారంభమైంది. ఫిబ్రవరి 26 శివరాత్రి (Maha Shivratri) వరకూ ఈ కుంభమేళా కొనసాగనుంది. దాదాపు 45 రోజులపాటూ జరిగే ఈ మహా కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 50 కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ ప్రభుత్వం ముందుగా అంచనా వేసింది. అయితే, అంచనాలకు మించి భక్తులు తరలివస్తున్నారు. మరో ఐదు రోజుల పాటు భక్తుల రద్దీ ఇదేవిధంగా కొనసాగుతే.. మహా కుంభమేళాలాలో పవిత్ర స్నానాలు చేసే భక్తుల సంఖ్య 65 కోట్లు దాటుతుందని యోగి ప్రభుత్వం అంచనా వేస్తోంది. మహా కుంభమేళాలో చివరి రోజైన ఫిబ్రవరి 26న రెండు కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా.
#WATCH | Prayagraj, UP: Devotees continue to arrive in large numbers at Triveni Sangam to take a holy dip during the ongoing Maha Kumbh Mela. pic.twitter.com/teYi19CGsI
— ANI (@ANI) February 21, 2025
Also Read..
Heart Attack | డ్రైవర్‌కు గుండెపోటు.. వాహనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఒకరు మృతి
Kashyap Patel: ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కశ్యప్ పటేల్