వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థ డైరెక్టర్‌గా భారతీయ సంతతి వ్యక్తి కశ్యప్ పటేల్(kash Patel) నియామక ప్రక్రియ పూర్తి అయ్యింది. గురువారం కాశ్ పటేల్ ను ఆ పోస్టుకు సేనేట్ కన్ఫర్మ్ చేసింది. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా నియమించడం పట్ల కాశ్ పటేల్ కృతజ్ఞతలు తెలిపారు. ఎక్స్ అకౌంట్లో అధ్యక్షుడు ట్రంప్‌కు ఆయన థ్యాంక్స్ తెలిపారు. ఎఫ్‌బీఐ దర్యాప్తు ఏజెన్సీ.. పారదర్శకత, బాధ్యత, న్యాయానికి మారు పేరు అని, ఆ సంస్థను పునర్ నిర్మించనున్నట్లు తన పోస్టులో కాశ్ పటేల్ తెలిపారు.
🇺🇸 @FBIDirectorKash Patel’s confirmation as FBI Director is a crucial step in executing President Trump’s agenda to restore integrity and uphold the rule of law.
The FBI will serve the American people and refocus on its core mission: enforcing justice fairly and without bias. pic.twitter.com/LoxYtx14VR
— The White House (@WhiteHouse) February 20, 2025
తనపై నమ్మకం ఉంచి, మద్దతు తెలిపిన అధ్యక్షుడు ట్రంప్, అటార్నీ జనరల్ పామ్ బోండీలకు థ్యాంక్స్ చెప్పారు. ఎఫ్‌బీఐ పట్ల ప్రజల్లో మళ్లీ విశ్వాసాన్ని కల్పించనున్నట్లు వెల్లడించారు. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా నియమించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. సేనేట్‌లో జరిగిన ఓటింగ్‌లో 51-49 ఓట్ల తేడాతో కాశ్ గెలిచారు. అయితే డెమోక్రటిక్ ఎంపీలు అందరూ.. కాశ్‌కు వ్యతిరేకంగా ఓటేశారు.
I am honored to be confirmed as the ninth Director of the Federal Bureau of Investigation.
Thank you to President Trump and Attorney General Bondi for your unwavering confidence and support.
The FBI has a storied legacy—from the “G-Men” to safeguarding our nation in the wake of…
— FBI Director Kash Patel (@FBIDirectorKash) February 20, 2025
ఎఫ్‌బీఐకి 9వ డైరెక్టర్‌గా కన్ఫర్మ్ చేస్తూ అధ్యక్షుడు ట్రంప్ కమీషన్‌పై అధికారిక సంతకం చేశారు. ఆ సంతకానికి చెందిన కాపీని వైట్‌హౌజ్ చీఫ్ తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశారు. ఎఫ్‌బీఐ కొత్త డైరెక్టర్‌గా కశ్యప్ పటేల్‌ను నియమించడాన్ని శ్వేతసౌధం స్వాగతించింది.
ఎవరీ కశ్యప్ పటేల్..
గుజరాతీ పేరెంట్స్‌కు 1980లో కశ్యప్ పటేల్ న్యూయార్క్‌లో జన్మించారు. ఈస్ట్ ఆఫ్రికాలో ఆయన పెరిగారు. లాంగ్ ఐలాండ్‌లోని గార్డెన్ సిటీ హై స్కూల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. రక్షణశాఖ ప్రోఫైల్ ప్రకారం.. యూనివర్సిటీ ఆఫ్ రిచ్మండ్లో అండర్‌గ్రాడ్యుయేషన్ చేశారు. ఆ తర్వాత ఆయన న్యూయార్క్ లో న్యాయ పట్టా పొందారు. యూకేలోని యూనివర్సిటీ కాలేజీ లండన్ ఫ్యాకల్టీ ఆఫ్ లాస్లో ఆయన అంతర్జాతీయ న్యాయ విద్యలో సర్టిఫికేట్ పొందారు. నేషనల్ సెక్యూర్టీ అడ్వైజర్‌గా చేశారు. హౌజ్ పర్మనెంట్ సెలెక్ట్ కమిటీ ఆన్ ఇంటెలిజెన్స్‌లో సీనియర్ కౌన్సిల్‌గా చేశారు.
కశ్యప్ పటేల్ గర్ల్‌ఫ్రెండ్ పేరు అలెక్సిస్ విల్కిన్స్. ఆమె గాయని, రచయిత, కామెంటేటర్. రిపబ్లికన్ నేత అబ్రహం హమాడేకు ప్రెస్ సెక్రటరీగా క్యాపిటల్ హిల్‌లో చేసిందామె. 2022 అక్టోబర్‌లో జరిగిన కన్జర్వేటివ్ రీఅవేకర్ అమెరికా సమావేంలో తొలిసారి కశ్యప్, అలెక్సిస్ కలుసుకున్నారు. 2023 నుంచి డేటింగ్లో ఉన్నారు. అమెరికా సైన్యంలో చేసి రిటైర్ అయిన వారి కోసం ఆమె పనిచేశారు. వారియర్ రౌండ్స్, ఆపరేషన్ స్టాండ్డౌన్, సోల్జర్స్ చైల్డ్ సంస్థకు పనిచేస్తోంది.