Heart Attack | డ్రైవింగ్ సమయంలో ఓ ట్రక్కు డ్రైవర్ (Truck Driver) గుండెపోటు (Heart Attack)కు గురయ్యాడు. దీంతో ట్రక్కు అదుపుతప్పి వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. ఈ ఘటన కర్ణాటక జిల్లాలోని కలబురగి (Kalaburagi)లో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ట్రక్కు యాద్గిర్ (Yadgir) జిల్లాలోని షాపూర్ నుంచి కలబురగి వైపు వెళ్తోంది. ఈ క్రమంలో డ్రైవింగ్ సమయంలో ట్రక్కు డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. ఈ క్రమంలో ట్రక్కు అనేక వాహనాలను ఢీ కొట్టింది. చివరికి ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో 32 ఏళ్ల కూరగాయల వ్యాపారి మహ్మద్ అలీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే స్పందించిన స్థానికులు గాయాలపాలైన డ్రైవర్‌ను చికిత్స కోసం కలబురగి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై జైవర్గి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read..
Suicides | ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో పురుషులే ఎక్కువ
Dwarka | అదిగదిగో ద్వారక.. కృష్ణుని కర్మభూమిపై అన్వేషణ మళ్లీ మొదలు!
Karnataka | గ్యారెంటీలకు గ్యారెంటీ లేదు.. కర్ణాటకకు గుదిబండగా కాంగ్రెస్ పథకాలు