Karnataka | గ్యారెంటీలకు గ్యారెంటీ లేదు.. కర్ణాటకకు గుదిబండగా కాంగ్రెస్ పథకాలు
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా గ్యారెంటీల పేరుతో అలవికాని హామీలు ఇచ్చిన కర్ణాటక కాంగ్రెస్ ఇప్పుడు వాటిని అమలు చేయలేక ఆపసోపాలు పడుతున్నది. ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా ఇచ్చిన హామీలు రాష్ట్ర ఖజానాను ఖాళీ చేస్తున్నాయి.
- స్కీమ్‌ల అమలుకు తీవ్ర నిధుల కొరత
- రాష్ట్ర ప్రణాళిక శాఖ నివేదికలో బహిర్గతం
- 3 నెలలుగా అందని అన్నభాగ్య, గృహలక్ష్మి
Karnataka | బెంగళూరు, ఫిబ్రవరి 20: ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా గ్యారెంటీల పేరుతో అలవికాని హామీలు ఇచ్చిన కర్ణాటక కాంగ్రెస్ ఇప్పుడు వాటిని అమలు చేయలేక ఆపసోపాలు పడుతున్నది. ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా ఇచ్చిన హామీలు రాష్ట్ర ఖజానాను ఖాళీ చేస్తున్నాయి. దీంతో లబ్ధిదారులకు పథకాల బకాయిలు పెరిగిపోతున్నాయి. కర్ణాటక ప్రభుత్వ ప్రణాళిక విభాగం తాజా నివేదిక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బహిర్గతం చేసింది. 2024-25కు గానూ ప్రభుత్వం రూ.3.71 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2024 డిసెంబర్ చివరి నాటికి ఇందులో 3.31 లక్షల కోట్లు కేటాయించింది. అయితే, విడుదల చేసినవి మాత్రం కేవలం రూ.2.03 లక్షల కోట్లే. ఇందులో ఖర్చు చేసినవి రూ.1.89 కోట్లు మాత్రమే. కేటాయింపులు, నిధుల విడుదలకు మధ్య రూ.1.28 లక్షల కోట్లు(61.3 శాతం) తేడా ఉండటం రాష్ట్ర ఆర్థిక స్థితికి అద్దం పడుతున్నది.
నెలలుగా అందని గ్యారెంటీలు
నిధుల కొరత కారణంగా గ్యారెంటీలు సరిగ్గా అమలు కావడం లేదు. మహిళలకు నెలకు రూ.2000 ఇచ్చే గృహలక్ష్మి పథకం లబ్ధిదారులకు మూడు నెలలుగా ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. జనవరి 31 నాటికి గృహలక్ష్మి బకాయిలు రూ.7,517 కోట్లు ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. రేషన్‌కార్డుదారులకు ప్రభుత్వం అన్నభాగ్య పథకం కింద ఒక్కొక్కరికి 10 కేజీల బియ్యం ఇవ్వాలి. ఇందులో కేంద్రం 5 కిలోలు, రాష్ట్రం 5 కిలోలు ఇవ్వాల్సి ఉంటుంది. బియ్యం కొరత కారణంగా కేజీకి రూ.34 చొప్పున డబ్బులు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే, 5 నెలలుగా లబ్ధిదారులకు ఈ డబ్బులు ఇవ్వడం లేదని తెలుస్తున్నది.
దేవుడు కూడా బాగు చేయలేడు
బెంగళూరులో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను బాగు చేయడం భగవంతుడికి కూడా కష్టమేనని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పేర్కొన్నారు. నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘భగవంతుడు స్వర్గం నుంచి దిగివచ్చి బెంగళూరు వీధుల్లో నడిచినా రెండుమూడేండ్లలో ఏమీ మారదు. పరిస్థితి చాలా క్లిష్టంగా మారుతున్నది. మనం సరైన ప్రణాళికతో ప్రాజెక్టులను సమర్థంగా అమలు చేయాలి. భవిష్యత్తు కోసం మంచి కారిడార్ అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నాం’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, బెంగళూరు రోడ్లపై 96 శాతం గుంతలను పూడ్చేశామని ఏడాది క్రితం అసెంబ్లీ సాక్షిగా డీకే శివకుమార్ ప్రకటించడం గమనార్హం.
– బెంగళూరు రోడ్లపై డీకే వ్యాఖ్యలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

