Suicides | న్యూఢిల్లీ: మన దేశంలో ఆత్మహత్యల రేటు 1990తో పోల్చినపుడు 2021నాటికి 30 శాతం తగ్గింది. 1990లో ఈ రేటు ప్రతి లక్ష మందికి 18.9 ఉండేది. 2019లో ఇది 13.1 కాగా, 2021లో 13కు తగ్గింది. అంటే, మూడు దశాబ్దాల్లో ఈ రేటు 31.5 శాతం తగ్గింది. ఈ కాలంలో పురుషుల కన్నా మహిళల ఆత్మహత్యల రేటు తగ్గింది.
1990లో ప్రతి లక్ష మంది జనాభాకు 16.8 మంది మహిళలు ఆత్మహత్య చేసుకోగా, 2021నాటికి ఇది 10.3కు తగ్గింది. 1990లో పురుషుల ఆత్మహత్యలు 20.9 కాగా, 2021లో 15.7గా ‘ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్’ తన నివేదికలో ప్రచురించింది.