Road accident : మహా కుంభమేళా (Mahakumbh) కు వెళ్తూ ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. వారు ప్రయాణిస్తున్న క్రూయిజర్ జీపు (Cruiser Jeep) ను లారీ (Lorry) ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారణాసి జిల్లా (Waranasi district) లోని మీర్జా మురారా (Mirza Murara) పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాలోని లడగేరి ఏరియాకు చెందిన 14 మంది క్రూయిజర్ జీపులో మహా కుంభమేళాకు బయలుదేరారు.
వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లా మీర్జా మురారా పోలీస్‌స్టేషన్ పరిధిలోని రూపాపూర్ గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్రూయిజర్ జీపులోని ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ సహా మిగతా ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు.
Delhi Assembly | ఈ నెల 25న ఢిల్లీ అసెంబ్లీ ముందుకు కాగ్ రిపోర్ట్.. ఆ రిపోర్టులో ఏముంది..?
Jagadish Reddy | ఏపీ నీటి దోపిడీతో.. తెలంగాణలో సాగు, తాగు నీళ్లకు కటకట: మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
Daaku Maharaaj OTT | ఓటీటీలోకి వచ్చేసిన ‘డాకు మహారాజ్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
Nandini Milk | వినియోగదారులకు షాక్.. పాల ధరల పెంపుకు కేఎమ్ఎఫ్ ప్రతిపాదన.. లీటరుపై ఎంతంటే..?