పాట్నా: బీహార్‌లో ఇటీవల వరుసగా హత్యా సంఘటనలు జరుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో ఇవి కలకలం రేపుతున్నాయి. (Bihar Murders ) అయితే వర్షాకాలం ముందు వ్యవసాయ పనులు లేకపోవడం వల్లనే సుపారీ హత్యలు పెరుగుతున్నాయని బీహార్ పోలీస్ అధికారి అన్నారు. అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) కుందన్ కృష్ణన్ గురువారం మీడియాతో మాట్లాడారు. బీహార్‌లో సాధారణంగా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో హత్యలు పెరుగుతాయని తెలిపారు. ఈ నెలల్లో ఎండాకాలం కారణంగా వ్యవసాయ కార్యకలాపాలు నిలిచిపోతాయని చెప్పారు. ఈ సమయంలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువకులు డబ్బుల కోసం నేరాలకు పాల్పడతారని, కాంట్రాక్ట్ హత్యలు కూడా జరుగుతాయని అన్నారు.
కాగా, చాలా కాలంగా ఇది కొనసాగుతున్నదని ఏడీజీ కుందన్ కృష్ణన్ తెలిపారు. వర్షాలు ప్రారంభమైన తర్వాత రైతు వర్గాలు బిజీగా ఉంటారని చెప్పారు. ఆ సమయంలో హత్యలు తగ్గుతాయని అన్నారు. అయితే ఈ ఏడాది మీడియా పదే పదే హత్యలను హైలైట్ చేసిందని విమర్శించారు. ఎన్నికలు కూడా జరుగుతున్నందున రాజకీయ పార్టీలు కూడా ఎక్కువ శ్రద్ధ చూపుతున్నాయని అన్నారు.
మరోవైపు బీహార్‌లో వరుస హత్యలపై తాము కూడా ఆందోళన చెందుతున్నట్లు కుందన్ కృష్ణన్ తెలిపారు. వీటిని అరికట్టేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అయితే బీహార్‌లో హత్యల పెరుగుదలను వ్యవసాయం, రైతులతో ఆ పోలీస్ అధికారి ముడిపెట్టడం వివాదానికి దారితీసింది. దీంతో ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి.
Also Read:
Professor Abuses Student | ఒడిశాలో మరో విద్యార్థిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్
Uddhav meets Fadnavis | ప్రభుత్వంలో కలవాలన్న ఆహ్వానం తర్వాత.. ఫడ్నవీస్‌ను కలిసిన ఉద్ధవ్ ఠాక్రే
Watch: పామును పట్టి మెడలో వేసుకుని బైక్‌పై వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?