e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home News గోవాలో ప్రారంభ‌మైన రాష్ట్ర‌వ్యాప్త క‌ర్ఫ్యూ

గోవాలో ప్రారంభ‌మైన రాష్ట్ర‌వ్యాప్త క‌ర్ఫ్యూ

గోవాలో ప్రారంభ‌మైన రాష్ట్ర‌వ్యాప్త క‌ర్ఫ్యూ

ప‌నాజీ: క‌రోనా పంజా విస‌ర‌డంతో దేశంలోని చాలా రాష్ట్రాలు క‌ర్ఫ్యూ బాట‌ప‌ట్టాయి. కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ అమలుచేస్తున్నాయి. నిన్న కేర‌ళ‌లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ ప్రారంభ‌మ‌య్యింది. తాజాగా మ‌రో ద‌క్షిణాది రాష్ట్రంలోనూ క‌ర్ఫ్యూ అమ‌ల్లోకి వ‌చ్చింది. క‌రోనా వ్యాప్తిని నిలువ‌రించ‌డానికి రాష్ట్రంలో నేటి నుంచి 15 రోజుల పాటు పూర్తి క‌ర్ఫ్యూను విధిస్తూ సీఎం ప్రమోద్‌ సావంత్ నిర్ణ‌యం తీసుకుంది. దీంతో రాజ‌ధానితోపాటు అన్ని ప్రాంతాల్లో ర‌హ‌దారులు నిర్మాణుష్యంగా మారాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అత్య‌వ‌స‌ర సేవ‌ల‌తో సంబంధం ఉన్న దుకాణాల‌ను తెరిచే అవ‌కాశం క‌ల్పించారు. అదేవిధంగా రెస్టారెంట్లు ఉద‌యం 7 గంట‌ల నుంచి సాయంత్రం 7 గంట‌ల వ‌ర‌కు ‘ఫుడ్‌ హోం డెలివరీ’ చేయ‌నున్నాయి. రాష్ట్రంలో ఈ నెల 24 వ‌ర‌కు క‌ర్ఫ్యూ అమ‌లులో ఉంటుంది.

గోవాలో ప్రారంభ‌మైన రాష్ట్ర‌వ్యాప్త క‌ర్ఫ్యూ

గోవాలో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 3751 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,16,213కు చేరింది. ఇందులో 32,387 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా, 82,214 మంది బాధితులు కోలుకున్నారు. మ‌రో 1612 మంది మృతిచెందారు. కాగా, దేశంలో కొత్త‌గా 4,03,738 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అదేవిధంగా 4,092 మంది వైర‌స్ వ‌ల్ల క‌న్నుమూశారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,22,96,414కు చేర‌గా, మృతులు 2,42,362కు పెరిగారు. మరో 1,83,17,404 బాధితులు క‌రోనానుంచి కోలుకోగా, 37,36,648 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కొత్త‌గా 3,86,444 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యార‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది.

గోవాలో ప్రారంభ‌మైన రాష్ట్ర‌వ్యాప్త క‌ర్ఫ్యూ

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవికూడా చదవండి..
మ‌హ‌మ్మారి మ‌ర‌ణ మృదంగం.. వ‌రుస‌గా రెండో రోజూ 4 వేల‌కుపైగా మృతులు
గోమూత్రం తాగండి.. క‌రోనాను నిలువ‌రించండి: బీజేపీ ఎమ్మెల్యే స‌ల‌హా
హ‌మ్మ‌య్య‌.. స‌ముద్రంలో కూలిపోయిన చైనా అతిపెద్ద రాకెట్‌
వ్యాక్సిన్ అవ‌స‌రం లేదు.. ల‌క్ష‌ల డోసుల‌ను నిరాక‌రిస్తున్న రాష్ట్రాలు
మాల్దీవ్స్ బార్‌లో ఆస్ట్రేలియా క్రికెట‌ర్లు కొట్టుకున్నారా?
న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు మెయిల్
ఆదుకోవాలంటూ ద‌ర్శ‌కుడు విజ్ఞ‌ప్తి.. సాయం చేసిన సోనూసూద్
బిగ్ బీ కన్నా అభిషేక్ బెస్ట్ యాక్ట‌ర్ అంటూ నెటిజ‌న్ కామెంట్..!


Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గోవాలో ప్రారంభ‌మైన రాష్ట్ర‌వ్యాప్త క‌ర్ఫ్యూ

ట్రెండింగ్‌

Advertisement