మహమ్మారి మరణ మృదంగం.. వరుసగా రెండో రోజూ 4 వేలకుపైగా మృతులు
మరణ మృదంగం| దేశంలో కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తున్నది. వరుసగా రెండో రోజూ నాలుగు వేలకుపైగా బాధితులు మరణించారు.

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తున్నది. వరుసగా రెండో రోజూ నాలుగు వేలకుపైగా బాధితులు మరణించారు. దేశంలో మొదటిసారిగా శనివారం నాలుగు వేలకుపైగా మరణాలు సంభవించిన విషయం తెలిసిందే. కాగా, రోజువారీ కేసులు వరుసగా నాలుగో రోజూ నాలుగు లక్షలు దాటాయి. దీంతో మొత్తం కేసులు 2.23 కోట్లకు చేరువలో నిలిచాయి.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 4,03,738 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా 4,092 మంది వైరస్ వల్ల కన్నుమూశారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,22,96,414కు చేరగా, మృతులు 2,42,362కు పెరిగారు. మరో 1,83,17,404 బాధితులు కరోనానుంచి కోలుకోగా, 37,36,648 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కొత్తగా 3,86,444 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 16,94,39,663 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశామని తెలిపింది.
ఇక కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 53,605 కేసులు ఉండగా, కర్ణాటకలో 47,563, కేరళలో 41,971 చొప్పున ఉన్నాయి. నిన్న ఒకేరోజు మరఠ్వాడలో 864 మంది కరోనాకు బలికాగా, కర్ణాటకలో 482 మంది, ఢిల్లీలో 332 మంది చనిపోయారు.
శనివారం ఒక్కరోజే 18,65,428 మందికి కరోనా పరీక్షలు చేశామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) ప్రకటించింది. దీంతో మే 8 వరకు మొత్తం 30,22,75,471 నమూనాలను పరీక్షించామని వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
గోమూత్రం తాగండి.. కరోనాను నిలువరించండి: బీజేపీ ఎమ్మెల్యే సలహా
పాకిస్థాన్‌లో తొలి హిందూ మహిళా కలెక్టర్!
ఆ ఖైదీలను విడుదల చేయండి
SSC CGL, CHSL పరీక్షలు.., కానిస్టేబుల్ నోటిఫికేషన్ వాయిదా
ప్రాణాలు నిలిపే పొడి డీఆర్డీవో సంజీవని
రకుల్ పెళ్లిపై నోరు విప్పిన మంచు లక్ష్మీ
కరోనాతో భర్త మృతిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న భార్య..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

