నారాయణఖేడ్, మే 10 : గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల పేరుతో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎగ్గొట్టిన కాంగ్రెస్‌కు బుద్ధి వచ్చే విధంగా ఎంపీ ఎన్నికల్లో ఓట్లు ఎత్తగొట్టాలని నారాయణఖేడ్ మా జీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నారాయణఖేడ్ మండలం సంజీవన్‌రావుపేట్ నమ్లిమెట్, డీఎన్టీ తండాల్లో పర్యటించి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్‌కు మద్దతుగా ఓటును అభ్యర్థించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అనేక సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయడంతో పాటు కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ పథకాలను అమలు చేసిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మా త్రం అధికారం కోసం అమలుకు నోచుకొని హామీలిచ్చి అమలు చేయకుండా మోసం చేసిందన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విభజన హామీలను అమలు చేయకుండా తెలంగాణపై వివక్ష చూపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పరమేశ్, నాయకులు రవీందర్ నాయక్, ప్రభాకర్, సత్యపాల్‌రెడ్డి, నవాబ్, భూపాల్, సాయిరెడ్డి, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.
నారాయణఖేడ్ మండలం దుర్గమ్మ తండావాసులు మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కాంగ్రెస్ నాయకులు తమకు మాయమాటలు చెప్పి కాంగ్రెస్‌లో చేర్చుకున్నారని, తమ తం డాలను అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీలోనే ఉండాలని నిర్ణయించుకుని తిరిగి బీఆర్ఎస్ లో చేరినట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు పార్శెట్టి సంగప్ప, నాయకులు ఉన్నారు.