నాగర్‌కర్నూల్/బిజినేపల్లి, మార్చి 11 : ఆ రుగాలం కష్టపడి సాగు చేసిన వరి, మొక్కజొ న్న, వేరుశనగ పంటలు కండ్లముందే వా డుపట్టి ఎండుతుంటే రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలో పదేళ్లపాటు రైతుల పంటలకు అవసరమైన సాగునీటిని అందించడంతో ఎలాం టి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల పంటలను సాగు చేసుకున్నారు. ప్రసుత్తం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అంటూ గొప్పలు చెప్పుకోవడమే తప్పా.. ఏ ఒక్కనాడు కూడా రైతుల కష్టాలను పట్టించుకున్న పాపాన పోలేదు. కష్టపడి సాగు చేసుకు న్న పంటలకు సైతం సరిపడా సాగునీటిని అం దించలేకపోవడంతో రైతులు ఎండుతున్న పం టలను చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లి, నాగర్‌కర్నూల్ తదితర మండలాల్లో వేసవి రాకముందే రైతులకు సాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో పంటపొలాలకు పుష్కలంగా నీటిని పారపెట్టుకున్న రైతులు ఈసారి కూడా అదేమాదిరిగా నీరు ఉంటుందనే ఉద్దేశంతో వరి, మొక్కజొన్న, వేరుశనగ వంటి పంటలను సాగు చేశారు. కానీ సాగు చేసిన పంటలకు నీటిని అందించలేకపోవడంతో ఎండుతున్న పంటలను చూసి రైతులు గగ్గోలు పెడుతున్నారు.
ఈప్రాంత రైతులకు సాగునీటిని అందిం చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి కృషితో 2022 జూన్ 18న బిజినేపల్లి మండలం శాయిన్‌పల్లి-గంగారం గ్రామాల పరిసర ప్రాంతాల్లో అప్పటి ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించిన మార్కండేయ రిజర్వాయర్‌ను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వినియోగించు కోకపోవడంతో సాగునీటి సమస్య తలెత్తుతుందని రైతులు బహిరంగంగా పేర్కొంటున్నారు. ఈ రిజర్వాయర్ ద్వారా బిజినేపల్లి మండలంలోని గంగారం, పోలేపల్లి, మంగనూర్, శాయిన్‌పల్లి తదితర తండాల రైతుల పంట పొలాలకు సాగునీటిని అందించాలనే ఉద్దేశంతో సుమారు రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించారు.
గత ప్రభుత్వ హయాంలో ఈ రిజర్వాయర్ ద్వారా పంట పొలాలకు నీరు అందించినప్పటికీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభు త్వం దాని గురించి పట్టించుకోవడం లేదు. దీంతో వేసవి ప్రారంభంలోనే ఈప్రాంత రైతుల పంట పొలాలకు సాగునీరు అందడం లేదు. రిజర్వాయర్‌ను ఉపయోగించుకోకపోవడంతో దీనినుంచి స్టాక్ పాయింట్ వరకు ఉన్న ఓపెన్ కెనాల్ ఎండిపోవడంతోపాటు పిచ్చిమొక్కలు, ముళ్ల పొదలు ఏపుగా పెరిగాయి. ఈ రిజర్వాయర్‌కు అనుసంధానంగా ఉన్న గంగారం గ్రామ శివారులోని తిమ్మారెడ్డికుంట స్టోరేజీ పాయింట్లో సాగునీరు లేక వెలవెలబోతున్నది. దీంతో పరిసర ప్రాంతాల రైతుల పంటలకు నీరందకపోవడం, అక్కడక్కడ ఉన్న బోరుబావుల్లో సైతం భూగర్భ జలాలు తగ్గడంతో రైతు కొద్దిపాటిగా సాగు చేసుకున్న పంటకు సైతం సరిపడా నీటిని అందించకపోతున్నాడు.
దీనికితోడు బోరుబావుల ద్వారా వస్తున్న నీటిని పొలాలకు పారిం చి పంటలు కాపాడుకుందామనుకున్న రైతులకు కరెంట్ కోత పెద్ద సమస్యగా మారింది. సమయపాలన లేకుండా ఇష్టానుసారంగా కరెంట్ సరఫరాలో కోతలు విధిస్తుండడంతో బోరు బావుల్లో ఉన్న నీటిని సైతం తమ పంటలకు పారించుకోలేకపోతున్నామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మార్కండేయ రిజర్వాయర్‌ను 90శాతం పూర్తి చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కా వస్తున్నా తిమ్మారెడ్డికుంట స్టోరేజ్ పాయింట్ నుంచి పంట పొలాలకు వెళ్లే గంగారం-శాయిన్‌పల్లి బైకెనాల్ పనులు నేటికీ మొదలు పెట్టకపోగా పనులు మరుగున పడ్డాయి.
మళ్లీ ప్రారంభించినా ఫలితం శూన్యం..
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మా ర్కండేయ రిజర్వాయర్‌ను కేటీఆర్ ప్రారంభించి అప్పట్లో నీటిని విడుదల చేశారు. కానీ అదే రిజర్వాయర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హడావుడి చేస్తూ మరోసారి ప్రారంభించింది. రైతులను తామే ఉద్దరిస్తున్నామన్న రీతిలో మిగిలి ఉన్న కొద్దిపాటి పనులను కూడా పూర్తి చేయకుండా నేటి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో 2025 జనవరి 12న మళ్లీ మార్కండేయ రిజర్వాయర్‌ను ప్రారంభించింది. అప్పట్లో రెండు మూడు రోజులు మాత్రమే నీటిని పారించి చే తులు దులుపుకొన్నారు. దీంతో సుమారు 7 వేల ఎకరాల సాగు కోసం దాదాపు రూ.80 కోట్లతో నిర్మించిన రిజర్వాయర్ నిరుపయోగంగా మారడంతో ఈ ప్రాంతంలో రైతులకు సాగునీటి సమస్య ఏర్పడింది.
ఓ పక్క రిజర్వాయర్ ద్వారా చుక్క నీరు రాకపోవడం మరో పక్క కరెంట్ సక్రమంగా లేక బోరుబావుల్లో ఉన్న నీటిని వాడుకోలేకపోతున్నామని, దీం తో కోతదశకు వచ్చిన పంటలు ఎండుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై మంగళవారం వసురాం తం డా సమీపంలో రైతులు ఆందోళన నిర్వహించారు. నీరు అందక పంటలు ఎండిపోతున్న విషయాన్ని ఇరిగేషన్ అధికారులకు, ప్రజాప్రతినిధులైన స్థానిక ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి, ఎమ్మె ల్సీ దామోదర్‌రెడ్డిలకు విన్నవించినా పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.