హమ్మయ్య.. సముద్రంలో కూలిపోయిన చైనా అతిపెద్ద రాకెట్

బీజింగ్: కొన్ని రోజులుగా నియంత్రణ కోల్పోయి భూమిపై ఎక్కడ కూలుతుందా అని టెన్షన్ పెట్టిన చైనాకు చెందిన అతిపెద్ద రాకెట్ హిందూ మహాసముద్రంలో కూలిపోయింది. భూ వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత తన భాగాలను చాలా వరకూ కోల్పోయిన రాకెట్.. చివరికి సముద్రంలో కూలిపోయినట్లు చైనా మీడియా వెల్లడించింది. బీజింగ్ కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 10:24 గంటల (భారత సమయం ఉదయం 07:54)కు లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ భూవాతావరణంలోకి తిరిగి ప్రవేశించింది. ఆ తర్వాత 72.47 డిగ్రీల తూర్పు రేఖాంశం, 2.65 డిగ్రీల ఉత్తర అక్షాంశాల దగ్గర కూలిపోయినట్లు చైనా మ్యాన్డ్ స్పేస్ ఇంజినీరింగ్ ఆఫీస్ వెల్లడించినట్లు చైనీస్ మీడియా తెలిపింది.
భూవాతావరణంలోకి రాగానే చాలా వరకూ రాకెట్ శకలాలు బూడిదైపోయాయి. గత నెల 29న లాంగ్ మార్చ్ 5బీని చైనాలోని హైనన్ దీవి నుంచి నింగికెగిరింది. వెంటనే అది నియంత్రణ కోల్పోవడంతో అది భూమిపై ఎక్కడ కూలుతుందో అన్న ఆందోళన కలిగింది. 5బీ వేరియెంట్లో ఇది రెండో రాకెట్. గతేడాది మేలో పంపిన తొలి రాకెట్ ఐవరీ కోస్ట్‌లో కూలింది. అప్పుడు కొన్ని భవనాలు దెబ్బతిన్నాయి. కానీ ఎవరూ గాయపడలేదు. నిజానికి భూమిపై ఎక్కువ భాగం నీళ్లే ఉండటం వల్ల ఇలాంటి రాకెట్లు జనావాసాలపై పడటం చాలా చాలా అరుదు అని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈసారి చైనా ఈ రాకెట్ కచ్చితంగా సముద్రంలోనే కూలుతుందని ప్రపంచానికి హామీ ఇవ్వలేకపోవడంతో ఆందోళన వ్యక్తమైంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

