e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home News క్ష‌ణికావేశంలో భార్య‌ను చంపి భ‌ర్త ఆత్మ‌హ‌త్య‌

క్ష‌ణికావేశంలో భార్య‌ను చంపి భ‌ర్త ఆత్మ‌హ‌త్య‌

క్ష‌ణికావేశంలో భార్య‌ను చంపి భ‌ర్త ఆత్మ‌హ‌త్య‌

న్యూఢిల్లీ: భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య మొద‌లైన చిన్న గొడ‌వ రెండు నిండు ప్రాణాల‌ను బ‌లితీసుకున్న‌ది. ఇద్ద‌రి మ‌ధ్య మాటామాటా పెరుగ‌డంతో ఆగ్ర‌హానికి లోనైన‌ భ‌ర్త.. భార్య‌ను న‌రికి చంపాడు. ఆ త‌ర్వాత ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం సీతాపూర్ జిల్లా మ‌చ్రెటా పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని కైమా గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది.

వివ‌రాల్లోకి వెళ్తే.. కైమా గ్రామానికి చెందిన మ‌హేంద్ర యాద‌వ్‌ (30), శాంతి యాద‌వ్ (25) ఇద్ద‌రూ భార్యాభ‌ర్త‌లు. శుక్ర‌వారం రాత్రి భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య ఉన్న‌ట్టుండి గొడ‌వ మొద‌లైంది. మాటామాటా పెరుగడంతో క్ష‌ణికావేశం ప‌ట్ట‌లేక‌పోయిన మ‌హేంద్ర యాద‌వ్‌ ఇంట్లో ఉన్న కొడ‌వ‌లి తీసుకుని శాంతి యాద‌వ్‌పై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డిన శాంతి యాద‌వ్‌ అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయింది.

ఆ త‌ర్వాత మ‌హేంద‌ర్ యాద‌వ్ కూడా ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. స్థానికులు ఇచ్చిన స‌మాచారం మేర‌కు పోలీసులు ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృత‌దేహాల‌ను పోస్ట్‌మార్టానికి త‌ర‌లించారు. కాగా, శుక్ర‌వారం రాత్రి ఇంట్లోంచి అర‌పులు వినిపించాయ‌ని, భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లే అనుకున్నాం గానీ, ఇంత ఘోరం జ‌రుగుతుంద‌ని ఊహించ‌లేద‌ని స్థానికులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

పండ్లలో విటమిన్‌.. ఇమ్యూనిటీ పెంచెన్‌

మైదా పిండి.. కొడుతుంద‌ట‌ ఆరోగ్యానికి గండి..!

మ‌హ‌మ్మారి మ‌ర‌ణ మృదంగం.. వ‌రుస‌గా రెండో రోజూ 4 వేల‌కుపైగా మృతులు

గోమూత్రం తాగండి.. క‌రోనాను నిలువ‌రించండి: బీజేపీ ఎమ్మెల్యే స‌ల‌హా

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
క్ష‌ణికావేశంలో భార్య‌ను చంపి భ‌ర్త ఆత్మ‌హ‌త్య‌

ట్రెండింగ్‌

Advertisement