e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home News మైదా పిండి.. కొడుతుంద‌ట‌ ఆరోగ్యానికి గండి..!

మైదా పిండి.. కొడుతుంద‌ట‌ ఆరోగ్యానికి గండి..!

మైదా పిండి.. కొడుతుంద‌ట‌ ఆరోగ్యానికి గండి..!

హైద‌రాబాద్‌: మ‌న‌లో చాలా మంది చపాతి, పరోట, రుమాలీ రోటి, తందూరీ రోటి వంటి వాటిని ఇష్టంగా తింటుంటారు. వాటిని తిన‌డంవ‌ల్ల ఆరోగ్యానికి ప్ర‌మాదం కాక‌పోయినా వాటి త‌యారీకి మైదాను ఎక్కువ‌గా వాడితే మాత్రం ముప్పు త‌ప్ప‌దంటున్నారు ఆరోగ్య‌ నిపుణులు. ఇండ్ల‌లో సంగ‌తి ఎలా ఉన్నా బ‌య‌ట హోట‌ళ్లు, టిఫిన్ సెంట‌ర్ల‌లో మాత్రం మైదాను విప‌రీతంగా ఉప‌యోగిస్తుంటారు. మైదా పిండి గోధుమ పిండి కంటే త‌క్కువ ధ‌ర‌కు ల‌భించ‌డం, మైదాతో చేసే ప‌దార్థాలు తెల్ల‌గా, రుచిగా ఉండ‌టం దాని అతి వినియోగానికి కార‌ణం. ఆరోగ్యానికి మంచిది కాదు కాబ‌ట్టి మైదా పిండితో చేసే ప‌దార్థాల‌ను తినే ముందు ఒక‌టికి రెండుసార్లు బాగా ఆలోచించాల‌ని హెల్త్ ఎక్స్‌ప‌ర్ట్స్ హెచ్చ‌రిస్తున్నారు.

మైదాపిండి ఎందుకు ప్ర‌మాదక‌రం..?
మిల్లుల‌లో గోధుమ పిండిని బాగా పాలీష్ చేసి, వివిధ ర‌సాయనాల‌ను క‌లిపి మైదా పిండిని త‌యారు చేస్తారు. ఎక్కువ‌గా పాలిష్ చేయ‌డంవ‌ల్ల మెత్త ద‌నం, క్లోరైడ్ గ్యాస్‌, బైంజ‌యిల్‌ పెరాక్సైడ్ లాంటి ర‌సాయ‌నాల మిక్సింగ్‌వ‌ల్ల మైదా పిండికి తెల్ల‌ద‌నం వ‌స్తుంది. ఈ ర‌సాయ‌నాలు ఆరోగ్యానికి హానిక‌రం. అందుకే చైనాతోపాటు, యూర‌ప్ దేశాలు బెంజ‌యిల్‌ పెరాక్సైడ్ వాడకంపై నిషేధం విధించాయి. మైదాలో ఆరోగ్యాన్ని దెబ్బ‌తీసే Alloxan అనే విషపూరితమైన రసాయనం కూడా ఉంటుంది.

మైదాతో వ‌చ్చే అన‌ర్థాలేమిటి..?
1. మనం తిన్న ఆహారం జీర్ణం కావాలంటే అందులో తప్పనిసరిగా ఎంతోకొంత‌ పీచు పదార్థం ఉండాలి. కానీ మైదాలో పీచుప‌దార్థం జీరో. కాబట్టి మైదా త్వ‌ర‌గా జీర్ణం కాకుండా పేగుల్లో పేరుకుపోతుంది. దీనివ‌ల్ల పేగుల్లో పుండ్లు ప‌డే ప్ర‌మాదం ఉన్న‌ది. అవి ముదిరితే క్యాన్స‌ర్ లాంటి తీవ్రమైన ప్రాణాంత వ్యాధుల‌కు దారితీస్తాయి.
2. మైదా పిండిని గోడ‌ల‌కు పోస్ట‌ర్ల‌ను అంటించ‌డానికి ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. ఎందుకంటే మైదాపిండిలోని జిగురు పోస్ట‌ర్లు గోడ‌కు గ‌ట్టిగా అంటుకునేలా చేస్తుంది. మైదాతో చేసిన ప‌దార్థాలను తిన్న‌ప్పుడు అవి మ‌న పేగుల‌కు కూడా అలాగే అతుక్కుపోతాయి. దాంతో వాటిలో క్రిములు ఉత్ప‌త్త‌య్యి ఇన్ఫెక్ష‌న్‌ల‌ను క‌లుగ‌జేస్తాయి.
3. మైదా పిండివ‌ల్ల కిడ్నీల్లో రాళ్లు కూడా ఏర్పడతాయి. గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉన్న‌ది. అంతేగాక మహిళలల్లో బ్రెస్ట్ సంబంధ‌ సమస్యలు ఉత్ప‌న్న‌మ‌వుతాయి.
4. మైదాలో కేవలం పిండి పదార్థం మాత్రమే ఉండ‌టం వ‌ల్ల పొట్ట వ‌స్తుంది. ప్రొటీన్‌లు నామమాత్రంగా ఉంటాయి.
5. అదేవిధంగా మైదాలో గ్లైకామిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. దానివ‌ల్ల ఒంట్లో షుగర్ లెవల్స్ పెరిగే ప్రమాదం ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

మేక‌ను ర‌క్షించుకోబోయి.. సింహం పంజాకు బ‌లి..!

ఆ 12 రాష్ట్రాల్లోనే 80 శాతానికిపైగా యాక్టివ్ కేసులు: కేంద్రం

పక్షి పిల్ల‌ల‌పై ద‌య‌చూపిన ఏనుగులు.. వైర‌ల్ వీడియో

కేంద్రం తొత్తులా ఈసీ.. సంస్క‌ర‌ణ‌లు చేయాల్సిందే: మ‌మ‌తాబెన‌ర్జి

కంగ‌నా రనౌత్‌కు క‌రోనా పాజిటివ్‌

క‌రోనాతో మ‌రో ప్ర‌ముఖ న‌టుడు మృతి

ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యలో అగ్ని ప్రమాదం

క్రికెట‌ర్ భువ‌నేశ్వ‌ర్ యాంక‌ర్ శ్యామ‌ల‌కు సోద‌రుడా?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మైదా పిండి.. కొడుతుంద‌ట‌ ఆరోగ్యానికి గండి..!

ట్రెండింగ్‌

Advertisement