Spirit | గ్లోబల్ స్టార్ యాక్టర్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. ఈ లిస్టులో మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ స్పిరిట్ (Spirit) టాప్‌లో ఉంటుంది. యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల్లో తాజా ఫొటో ఒకటి జోష్ నింపుతోంది. ప్రభాస్ ఇందులో తొలిసారిగా పోలీసాఫీసర్‌గా కనిపించబోతున్నాడని తెలిసిందే.
ఇందులో ప్రభాస్ లుక్ ఎలా ఉండబోతుందో అంటూ నెట్టింట తెగ చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ షూట్ లొకేషన్లో హెయిర్ స్టైలిష్ట్‌తో కలిసి దిగిన సెల్ఫీ నెట్టింట వైరల్ అవుతోంది. ప్రభాస్ స్టైలిష్ గాగుల్స్, క్లాస్ అండ్ మాస్ టచ్ ఇచ్చే హెయిర్ స్టైల్‌తో మ్యాన్లీ లుక్‌లో కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. స్పిరిట్‌లో ప్రభాస్ కనిపించేది ఇలాగే అంటూ ఖుషీ అవుతున్నారు.
హై ఓల్టేజీ కాప్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో యానిమల్ ఫేం తృప్తి డిమ్రి హీరోయిన్గా నటిస్తోంది. వివేక్ ఒబెరాయ్, ప్రకాశ్ రాజ్, కాంచన, ఐశ్వర్యా దేశాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. కాగా స్పిరిట్‌లో కనిపించబోయే కీలక నటీనటులపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
సందీప్ రెడ్డి వంగా హోం బ్యానర్ భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్‌తో కలిసి సంయుక్తంగా తెరకక్కిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రాణే సంగీతం అందిస్తున్నాడు. స్పిరిట్‌లో బాలీవుడ్ యాక్టర్ వివేక్ ఒబెరాయ్ విలన్‌గా నటిస్తున్నాడు. ప్రభాస్, వివేక్ ఒబెరాయ్ మధ్య వచ్చే హై ఆక్టేన్ ఫైట్ సీక్వెన్స్‌ను నయా షెడ్యూల్లో షూట్ చేస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయని తెలిసిందే.
Latest pic of #Prabhas from the shoot of #Spirit with hairstylist. ❤️🔥#RebelstarPrabhas pic.twitter.com/bgVR2rQJuy
— Suresh PRO (@SureshPRO_) June 3, 2026
Small Habits | రోజువారీ జీవితంలో చాలా మంది చేసే చిన్న చిన్న పొరపాట్లు ఇవే.. వీటిని చేయకూడదు..
Nallagonda | డీసీఎంను ఢీ కొట్టిన మినీ ట్రావెల్ బస్సు..ఒకరు మృతి, 13 మందికి గాయాలు
Rayapol | ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల రాస్తారోకో..భారీగా ట్రాఫిక్ జామ్