e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home News ఆ 12 రాష్ట్రాల్లోనే 80 శాతానికిపైగా యాక్టివ్ కేసులు: కేంద్రం

ఆ 12 రాష్ట్రాల్లోనే 80 శాతానికిపైగా యాక్టివ్ కేసులు: కేంద్రం

ఆ 12 రాష్ట్రాల్లోనే 80 శాతానికిపైగా యాక్టివ్ కేసులు: కేంద్రం

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి అంత‌కంత‌కూ విస్త‌రిస్తూనే ఉన్న‌ది. ప్ర‌తిరోజూ ల‌క్ష‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. వేల‌ల్లో మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. గ‌త నాలుగు రోజులుగా అయితే రోజుకు నాలుగు లక్ష‌ల‌కుపైగా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర స‌హా మొత్తం 12 రాష్ట్రాల్లో ఈ మ‌హ‌మ్మారి ప్ర‌భావం అత్య‌ధికంగా ఉన్న‌ది. దేశం మొత్తంలో ఉన్న యాక్టివ్ కేసుల్లో ఆ 12 రాష్ట్రాల్లోనే 80 శాతానికిపైగా కేసులు ఉన్నాయ‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది.

కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ శనివారం విడుద‌ల చేసిన‌ డాటా ప్ర‌కారం.. దేశం మొత్తంలో ప్ర‌స్తుతం 37.23 ల‌క్ష‌ల యాక్టివ్ కేసులు ఉన్నాయి. అందులో 80.68 శాతం కేసులు కేవ‌లం 12 రాష్ట్రాల నుంచే ఉన్నాయి. అందులో మ‌హారాష్ట్ర‌లో అత్య‌ధికంగా 6.57 ల‌క్ష‌ల యాక్టివ్ కేసులు ఉండ‌గా.. 5,36,661 యాక్టివ్ కేసుల‌తో క‌ర్ణాట‌క, 4,02,997 యాక్టివ్ కేసుల‌తో కేర‌ళ‌, 2,54,118 యాక్టివ్‌ కేసుల‌తో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, 1,99,147 యాక్టివ్‌ కేసులతో రాజ‌స్థాన్ ఆ త‌ర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల‌తోపాటే మ‌రో ఏడు రాష్ట్రాల్లో (ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, గుజ‌రాత్‌, త‌మిళ‌నాడు, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, ప‌శ్చిమ‌బెంగాల్‌, హ‌ర్యానా, బీహార్‌) అత్య‌ధికంగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

10 రాష్ట్రాల్లో 70.77 శాతం కొత్త కేసులు
ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో న‌మోదైన కొత్త కేసుల్లో కూడా కేవ‌లం 10 రాష్ట్రాల నుంచే 70.77 శాతం కేసులు ఉన్నాయి. వాటిలో 54,022 కొత్త కేసుల‌తో మ‌హారాష్ట్ర‌, 48,781 కొత్త కేసుల‌తో క‌ర్ణాట‌క‌, 38,460 కొత్త కేసుల‌తో కేర‌ళ తొలి మూడు స్థానాల్లో ఉండ‌గా.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ (27,763), త‌మిళ‌నాడు (26,465), ఢిల్లీ (19,832), ప‌శ్చిమ‌బెంగాల్ (19,216), రాజ‌స్థాన్ (18,231), ఆంధ్ర‌ప్ర‌దేశ్ (17,188), హ‌ర్యానా (13,867) త‌ర్వాత స్థానాల్లో ఉన్నాయి.

మ‌ర‌ణాల రేటు 1.09 శాతం
అదేవిధంగా దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య సుమారు 2.19 కోట్ల‌కు చేర‌గా.. అందులో మ‌ర‌ణాల రేటు 1.09 శాతంగా ఉన్న‌ది. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశంలో 4,187 క‌రోనా మ‌ర‌ణాలు సంభ‌వించ‌గా.. అందులో మ‌హారాష్ట్ర‌లో అత్య‌ధికంగా 898 మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఆ త‌ర్వ‌త క‌ర్ణాట‌క‌లో 592 మంది, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో 372 మంది, ఢిల్లీలో 341 మంది, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో 208 మంది, త‌మిళ‌నాడులో 197 మంది, పంజాబ్‌లో 165 మంది, రాజ‌స్థాన్‌లో 164 మంది, హ‌ర్య‌నాలో 162 మంది, ఉత్త‌రాఖండ్‌లో 137 మంది, జార్ఖండ్‌లో 136 మంది, గుజ‌రాత్‌లో 119 మంది, ప‌శ్చిమ‌బెంగాల్‌లో 112 మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇక‌ తాజా మ‌ర‌ణాల‌తో క‌లిపి దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా మృతుల సంఖ్య 2,38,270కి చేరింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

కేంద్రం తొత్తులా ఈసీ.. సంస్క‌ర‌ణ‌లు చేయాల్సిందే: మ‌మ‌తాబెన‌ర్జి

కంగ‌నా రనౌత్‌కు క‌రోనా పాజిటివ్‌

క‌రోనాతో మ‌రో ప్ర‌ముఖ న‌టుడు మృతి

ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యలో అగ్ని ప్రమాదం

క్రికెట‌ర్ భువ‌నేశ్వ‌ర్ యాంక‌ర్ శ్యామ‌ల‌కు సోద‌రుడా?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆ 12 రాష్ట్రాల్లోనే 80 శాతానికిపైగా యాక్టివ్ కేసులు: కేంద్రం

ట్రెండింగ్‌

Advertisement